చిట్వేలి లోని పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ కొరముట్ల.
--ఈ క్రాప్ పై రెవెన్యూ,వ్యవసాయ అధికారులతో సమీక్ష.
--ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీ.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలోని పలు కార్యక్రమంలో ఈరోజు ఉదయం ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. తొలుతగా ఖరీఫ్ సీజన్లో రైతులు సాగు చేసే పంటను... నమోదు చేసే కార్యక్రమమైన ఈ క్రాప్ నమోదు పై మండల రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులతో రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాను మాట్లాడుతూ... ఈ విధానం వల్ల అనుకోని వైపరీత్యాలు ఏర్పడినప్పుడు రైతుల పంటలకు ఏర్పడి నష్టాలను అంచనా వేయడానికి, సాగు చేయి పంటలకు సబ్సిడీలను అందించడానికి మరియు ప్రభుత్వం తరఫున పంట కొనుగోలు ప్రక్రియను చేపట్టడానికి ఈ విధానం ఎంతో ఉపయోగకరమని, కావున మండల పరిధిలోని రైతన్నలందరికీ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని అధికారులు తెలియపరచి పంట సాగు చేయు భూమి వివరాలను మరియు సాగు చేయు పంటను డిజిటల్ విధానంలో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, తాసిల్దార్ మురళి,ఎంపీడీవో మోహన్, హార్టికల్చర్ అధికారి ఆసియా, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది, వీఆర్ఏలు, గ్రామ వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీ:
తదుపరి ప్రభుత్వం ద్వారా అమలయే జగనన్న గోరుముద్ద కార్యక్రమ సమీక్షలో భాగంగా.. ఉన్నత పాఠశాలలో భోజన సమయంలో వెళ్లి స్వయంగా ఆహార పదార్థాలను రుచి చూసి పిల్లలకు వడ్డిస్తూ వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, తాసిల్దార్ మురళి, ఎంపీడీవో మోహన్,ఎంఈఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments