వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్న ముక్కలాంటిది
. ఎం ఆర్ కె ఆర్ సంస్థ వాలంటీర్లకు దుస్తుల పంపిణీ.
.ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి.
నందలూరు మండలం లోని వాలంటీర్ లకు రాజంపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి స్వంత సంస్థ అయిన ఎం. ఆర్. కె. ఆర్. (మేడా రామకృష్ణ రెడ్డి) ద్వారా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి వెన్నెముక లాంటిదని ఇప్పటివరకు ఎ ముఖ్యమంత్రి చేయని ఎన్నో పథకాలను నేరుగా ప్రజలోనికి తీసుకొని పోవడానికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి, ఎంతో మందికి ఇబ్బందులు కలుగ కుండా చేయడం జరిగిందని అన్నారు. వాలంటీర్ లు కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు, వారు చేసిన సేవా మరువ లేనిది అని వీరి సేవను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇచ్చి మెచ్చుకోవడం జరిగింది అని అన్నారు. అలాగే మా సంస్థ ఎం.అర్. కె.అర్. నుండి మా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ దుస్తులు పంపిణీ చేయడం జగిందన్నారు. మరో సారి మన ముఖ్యమంత్రి నీ అందరు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి , జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ఈడిగా కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మి నరసయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు కలీం, మాజీ కో ఆప్షన్ సభ్యుడు మున్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comentários