మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి - ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి
ఉన్నతి మహిళా శక్తి పధకం ద్వారా ఆటోలు పంపిణీ
నందలూరు మండలం నకు చెందిన రాపూరు రేణుకా ఎల్లమ్మ కు ఉన్నతి మహిళా శక్తి పధకం ద్వారా ఆటో అందించిన ఎమ్మెల్యే, అనంతరం ఆయన మాట్లాడుతూ. మహిళల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతి మహిళ శక్తి ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు పధకాన్ని ప్రవేశపెట్టారన్నారు. లబ్ధిదారులు ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే శక్తి కార్యక్రమం కింద మహిళలకు చెల్లిస్తే సరిపోతుందని, మిగతా 90 శాతం రుణం సెర్ఫ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ రుణానికి ఎలాంటి వడ్డీ ఉండదన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అందులో భాగంగా నిరంతరం ఆదాయం పొందేలా చేయూత నిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళలపై ఎలాంటి భారం పడకుండా రుణాలు చెల్లిస్తూ సొంత కాళ్లపై నిలబడేందుకు ఉన్నతి మహిళా శక్తి పథకం ఎంతో దోహద పడుతుంది ఆన్నారు. దీని ద్వారా ఆటోలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం ఆటో ను ప్రారంభించి మొదట ఎమ్మెల్యే ప్రయాణించి ఆటో మహిళ డ్రైవర్ బాడుగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నందలూరు మండలఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ఏ.పి.యం . వసుందర, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments