అసత్యాలతో తనపై విష ప్రచారం టిడిపికి తగదు, అధిష్టానం మెప్పు పొందెందుకే ప్రవీణ్ ఆర్భాటం - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
అసత్య ఆరోపణలతో ప్రొద్దుటూరు ప్రజలలో తనపై విష బీజాలు నాటే ప్రయత్నం చేయడం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డికి తగదని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేరని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం టిడిపి జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి స్థానిక నియోజకవర్గ ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి లను స్వాగతిస్తూ తెదేపా శ్రేణులు చేసిన ర్యాలీ పై ఆయన నిప్పులు చెరిగారు. టిడిపి ఏ ఉద్దేశంతో ర్యాలీని చేస్తుందో తెలుసుకోవాలని, ఆ ర్యాలీ వల్ల ప్రజలకు ఆటంకం కలుగుతుందా లేదా విచారించిన తర్వాతే పోలీసులు ర్యాలీకి ఇవ్వాల్సి ఉందని, అవేమీ తెలుసుకోకుండా పోలీసులు అనుమతులు ఇవ్వడాన్ని ఆయన ప్రశ్నించారు. కేవలం ప్రవీణ్ రెడ్డి అధిష్టానంకే ఆర్భాటం చేసినట్లు తెలుస్తోందని విమర్శించారు.
ప్రవీణ్ రెడ్డి పై 8 అక్రమ కేసులు అధికారపక్షం బనాయించిందన్న టిడిపి పోలీసు బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. ప్రవీణ్ రెడ్డి పై నమోదైన కేసుల నిజ నిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ఆరోపణలతో విష ప్రచారాలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రవీణ్ రెడ్డి పై ఉన్నది ఆరు కేసు లేనని అందులో 5 కేసులు ప్లకార్డులు పట్టుకొని నిరసనలు, దేవాలయ అధికారులపై నిరసనల లాంటి ఉద్యమాలు పోరాటం చేసే క్రమంలో పెట్టిన కేసులని, మరొకటి తన స్వతహాగా దాడి చేసిన బాధితుడు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసు అని వివరించారు. ఇలాంటి కేసులు ప్రజా క్షేత్రంలో ప్రజా పోరాటం ఉద్యమాలు చేసే ప్రతి నాయకుడి పై నమోదవుతాయన్నది తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకే టిడిపి ఇన్చార్జి ప్రవీణ్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై ప్రవీణ్ చేసిన పోరాటాలపై ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టిడిపి నాయకుల పై ఒక్క కేసైనా నమోదు అయినట్లు నిరూపించగలరా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలతో ప్రజలలో తనపై ఉన్న నమ్మకాన్ని మసకబార్చలేరని పేర్కొన్నారు. గత టిడిపి ప్రభుత్వ పాలనలో తన కుటుంబ సభ్యులపై వైసిపి నాయకులపై ఎన్నో అక్రమ కేసులు నమోదైన సంగతిని గుర్తు చేశారు. కానీ ఆనాటి పరిస్థితి ప్రస్తుతం లేదని టిడిపి వారిపై అక్రమ కేసులు బనాయించే ప్రశ్నే లేదని, ధర్మబద్ధంగానే టిడిపి పై పోరాటం చేస్తానని తెలిపారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోకుండా పొద్దుటూరు పర్యటనలో తనపై ఆరోపణలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
Comments