అభివృద్ధి సంక్షేమమే సీఎం ధ్యేయం
ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
ప్రొద్దుటూరు సెప్టెంబర్ 18 ప్రసన్న ఆంధ్ర:
అభివృద్ధి సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్యేయం అని రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడంలో తనదైన శైలిలో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అహర్నిశలు కష్టపడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు సోమలవారి పల్లి పంచాయతీలోని పెన నగర్ లో ఆదివారం ఉదయం సర్పంచ్ మోపూరు ప్రశాంతి ఎంపీపీ సానబోయిన శేఖర్ ఆధ్వర్యంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు, కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్ హాల్ వద్ద ఉన్న ధోబి ఖానా లో పర్యటించి అక్కడ ఉన్న రజకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రజకులకు ప్రభుత్వ తరఫున వచ్చిన సంక్షేమ పథకాలన్నీ సకాలంలో అందాయ లేదా అని ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే రాచమల్లుకు గులాబి పూలతో ఘన స్వాగతం పలికారు వార్డులను ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపడ్డ సంక్షేమ పథకాలు తమకు సకాలంలో అందించి మా కుటుంబానికి పెద్దన్నయ్య నిలిచి తమ బాగోగుల కోసం నవరత్నాల్లో చెప్పిన ప్రతి ఒక్కటి తమకు అందేలా చేసిన జగన్మోహన్ రెడ్డికి వారు కృతజ్ఞత తెలియజేశారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ మా నాయకుడు మాటలు చెప్పే మనిషి కాదని చెప్పాడు అంటే చేస్తాడు అంతే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ఏ ఒక్కరికి ఇల్లు లేదని మాటే రాకూడదని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి అందుకు సంబంధించిన డబ్బులు కూడా వారికి అందజేసి ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకొని సంతోషంగా జీవించాలని తమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో సోములవారిపల్లి ఉప సర్పంచ్ రామకృష్ణారెడ్డి భావన సహకార సంఘం చైర్మన్ గోపిరెడ్డి రమణయ్య ఎంపిటిసిలు నరసింహులు గోటూరు వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మునిరెడ్డి వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు కాకర్ల నాగ శేషారెడ్డి. బొందిలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రసపుత్ర రజని. మార్కెట్ యార్డ్ చైర్మన్ యాలం శంకర్ యాదవ్,మున్సిపల్ కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి. పిట్ట బాలాజీ. ఇర్ఫాన్ భాష యాల్లాల మహమ్మద్ గౌస్. కోనేటి సునంద గరిశపాటి లక్ష్మీదేవి. నాయకులు అక్బర్. ఆచారి కాలనీ శివారెడ్డి, నాగార్జున రెడ్డి. రాయపరెడ్డి కంభం పాములేటి రాగా నరసింహారావు. రజక సంఘం అధ్యక్షుడు వన్నెటి కాశయ్య .సచివాలయం సిబ్బంది, వార్డు వాలంటీర్లు కార్యకర్తలు పోలీస్ సిబ్బంది వైసీపీ నాయకులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments