top of page
Writer's picturePRASANNA ANDHRA

లక్ష పైచిలుకు మెజారిటీతో నా గెలుపు ఖాయం - ఎమ్మెల్యే రాచమల్లు

సమర శంఖం పూరించడానికి వైసిపి శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు - ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

రాష్ట్రంలో 60 రోజులలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈనెల 15న ప్రచారం ప్రారంభిస్తున్న నేపథ్యంలో సమర శంఖం పూరించడానికి వైసిపి శ్రేణులు తనతో పాటు సిద్ధం కావాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొర్రపాడు రోడ్డు లోని తన సొంత మైదానంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు సచివాలయ కన్వీనర్లు గృహసారథులు మరియు వాలంటీర్లతో ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈనెల 15న ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయం నుండి ఎన్నికల ప్రచారం చేపడుతున్నామని తనతోపాటు వైసీపీ శ్రేణులు కథని తొక్కాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రెండు నెలలపాటు అవిశ్రాంతంగా శ్రమించి అఖండ మెజారిటీతో గెలుపును సాధించేలా కృషి చేయాలన్నారు అబద్దాలతో ప్రచారం చేస్తున్న వైవి పక్షాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు ఏనాడు పేద ప్రజా సమస్యల పట్ల మాట్లాడిన టిడిపి అబద్దాల అజెండాతో ప్రజల ముందుకు వస్తోందని తెలిపారు. టిడిపి అబద్దాలను తిప్పి కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు చేసిన విధానం ప్రజలకు వివరించాలన్నారు పొద్దుటూరు నియోజకవర్గంలో ఏనాడు ప్రతిపక్ష పార్టీ ప్రజలకు ఆపదలోనూ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ సహాయంలోనూ తోడు లేరని ప్రజలకు వివరించాలన్నారు కేవలం ఎన్నికలు ఆరు నెలలు ఉండగా టికెట్ సంపాదన కోసం నాన్న రకాల జిమ్మిక్కులు పోటీపడి నటిస్తున్నారని ఎద్దేవా చేశారు 25 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తిరిగి మోసం చేయడానికి మాజీ ఎమ్మెల్యే వరద ప్రజల ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు పట్టణ ప్రజల సమస్యలతో ఎందుకు రాలేదని నిలదీశారు కనీసం నాలుగున్నర సంవత్సర కాలంలో కూడా ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించ లేకపోగా ప్రజలను గాలికి వదిలేశారని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల పాలనలో రెండు సంవత్సరాలు పరిస్థితులను ఎదుర్కొందన్నారు మిగిలిన మూడు సంవత్సరాలలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సుమారు 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు అంతేకాకుండా పురపాలక సంఘ పరిధిలో 120 కోట్లతో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరి ఉందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన వైనాన్ని ప్రజలకు గుర్తు చేయాలన్నారు. నిత్యం వైసిపి పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొట్టమొదటి నియోజకవర్గంగా విజయ డంక మోగించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పాల్గొన్న వైసీపీ శ్రేణులతో ఎన్నికల సమర శంఖారావానికి సిద్ధం అని నినాదాలు పలికించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ సభ్యులు కాకర్ల నాగశేషారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ, జడ్పీ వైస్ చైర్మన్ జ్యేష్టాది శారద, వైసిపి మండల కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page