బెనర్జీ హత్యాయత్నం కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలి - ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
బెనర్జీ హత్యాయత్నంలో టిడిపి ప్రొద్దుటూరు ఇంచార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి, నందం అపరాజిత హస్తం ఉందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బెనర్జీ హత్యాయత్నానికి సంబంధించి అతని తగిలిన గాయాల తీవ్రతను ఫోటోల రూపంలో పాత్రికేయులకు చూపించి, టిడిపి నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బెనర్జీకి తగిలినవి చిన్నపాటి గాయాలు అని చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఆ మాటలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. హైదరాబాదులో దాదాపు 8 గంటల 30 నిమిషాలు బెనర్జీ తలకు తగిలిన గాయానికి ఆపరేషన్ చేశారని, ఇది ఉద్దేశపూర్వకంగానే గతంలో ఉన్న పాత కక్షల కారణంగా హత్యాయత్న ప్రయత్నం జరిగినట్లు ఆయన ఆరోపించారు. ఈ హత్యాయత్నంపై తమకు ఇంకా అనుమానాలు తలెత్తుతున్నాయని, ప్రవీణ్ తండ్రి ప్రతాపరెడ్డి హత్యాయత్నం జరిగిన పది నిమిషాలలో కడపలో ఓ పోలీసు అధికారికి అలాగే ప్రొద్దుటూరులోని ఇద్దరి లాయర్లకు వాట్సప్ ద్వారా కాల్ చేసి విషయాన్ని తెలియజేశారని అన్నారు. ముందు రోజే సామాజిక సాధికార బస్సు యాత్రను అడ్డుకుంటామని పట్టణంలో కరపత్రాలు పంచారని ఆయన గుర్తు చేశారు. బెనర్జీ హత్యాయత్నం కేసులో నిందితులైన భరత్, రామ్మోహన్ రెడ్డిలను పోలీసులు సత్వరం అరెస్టు చేయాలని, ప్రవీణ్ ను పోలీసులు అరెస్టు చేసి అలాగే అపరాజిత ను కూడా విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో బెనర్జీ పోలీసులకు హత్యాయత్నం జరిగిన తీరును స్టేట్మెంట్ రూపంలో ఇవ్వనున్నట్లు ఆయన తెలియజేశారు.
Comentários