రాచమల్లు వారి సంక్రాంతి కానుకలు పంపిణీ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతిని శుభాకాంక్షలు తెలియజేస్తూ మునిసిపల్ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో 'రాచమల్లు వారి సంక్రాంతి కానుక' క్రింద కొత్త బట్టలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. తన మాట మన్నించి ఔట్ సోర్సింగ్ కార్మికులు నిరసన విరమించి విధులలో చేరినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రతిపక్ష విపక్షాల మాటలు విని అనవసరంగా ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయవద్దని కోరారు. రానున్న రోజుల్లో తమ ప్రభుత్వం మునిసిపల్ కార్మికుల డిమాండ్లను నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం మునిసిపల్ కార్మికుల సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ జీతంతో పాటు జతచేసి ఇస్తోందని, అలాగే సంక్రాంతి పురస్కరించుకొని వేయి రూపాయల నగదు రూపంలో ఇస్తోందని అన్నారు. వివక్షలు విడనాడి తన మాట మన్నించిన 66 సానిటరీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ సమయంలో వారి సేవలను కొనియాడారు. ఇందుకుగాను తన వొంతు సహాయంగా చిరుకానుక అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలో ప్రభుత్వ పెద్దలలో చర్చించి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్షిదేవి నాగరాజు, వార్డు కౌన్సిలర్లు, మునిసిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Comentários