స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు - ఎమ్మెల్యే రాచమల్లు
కడప జిల్లా, ప్రొద్దుటూరు
కొత్తపల్లి పంచాయతీ 13వ వార్డు నందు 35 లక్షల రూపాయల వ్యయంతో 180 మీటర్ల సిసి రోడ్డు, 600 మీటర్ల మురుగునీటి కాలువ నిర్మాణం కోసం ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పూజా ఇంటర్నేషనల్ స్కూల్, మై డాడీ హోమ్ వ్యవస్థాపకుడు ఎన్. రాజారెడ్డి తన సోదర సమానుడని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీరాభిమాని అని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన హత్య తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సందర్భంగా పూజ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద క్యాంప్ వేస్తాము అంటే వైఎస్ఆర్సీపీ అభిమానిగా రాజారెడ్డి తిరస్కరించాడన్నాడు. పోలీసులతో మాట్లాడి కటినంగా వ్యవహరించాలని తాను కోరినట్లు, సొంత అన్నను తమ్ముడు హత్య చేయటం మానవత్వానికి, రక్తసంబందానికి మచ్చ తెచ్చిన హేయమైన చర్యగా తాను భావిస్తున్నట్లు తెలిపారు.
రాజారెడ్డి హత్యకు రాజకీయాన్ని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆపాదిస్తున్నారని, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే నిందను ఆపాదిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు, విధి నిర్వహణలో నిస్వార్థంగా పోలీసులు పురోగతి సాధించారని, సీఐ ఇబ్రహీం, ఎస్ఐ చిరంజీవి, శివ ప్రసాద్ లను అభినందిస్తున్నట్లు, రాజారెడ్డి హత్యపై మానవతా హృదయంతో తాను స్పందించానని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో స్పందించినట్లు ఆయన గుర్తు చేశారు. సభ్య సమాజం తల దించుకునే విధంగా వరద మాట్లాడుతున్నట్లు, రాచమల్లు చేతికి రక్తం అంటదని, తాను ఏనాడు హింసను ప్రేరేపించలేదు అన్నారు. సమాజంలో అహింస సత్యము ధర్మము గొప్పదని, దయచేసి ఇప్పటికైనా పోలీసులపై వరద అస్త్య ఆరోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. తాము రాజకీయ ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదని అన్నారు. రాజారెడ్డి హత్య కేసు చేదించిన పోలీసులకు అభినందనలు తెలుపుతూ తానే స్వయంగా పోలీస్ స్టేషన్ వెళ్లి సన్మానిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comentarios