పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దు - ఎమ్మెల్యే రాచమల్లు విజ్ఞప్తి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా, బాధ్యతగా పరిగణించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, రానున్న ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి రెండు లేదా మూడవ వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కావచ్చని, ఎన్నికల కమిషన్ తన విధులను కొనసాగిస్తూ ఓటర్ల జాబితాను సిద్ధం చేసిందని, మార్పులు చేర్పులు చేయనున్నారని బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నంది ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న సమయంలో ప్రజలు, వ్యాపారస్తులు డబ్బు వ్యవహారాలు, లావాదేవీలు బ్యాంకుల ద్వారా కొనసాగించుకోవాలని, లేని పక్షంలో పోలీసుల తనిఖీలతో ఇబ్బంది తప్పదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా ఎన్నికల కమిషన్ కు ఆటంకం కలిగించకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తనిఖీల పేరుతో ప్రజలను, సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతరం చంద్రబాబు నాయుడు పై ఏసీబీ దాఖలు చేసిన కేసులపై స్పందిస్తూ, ప్రజల సొమ్మును టిడిపి ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వాహా చేసి, 52 రోజులపాటు జైలు పాలయ్యారని, తనపై ఉన్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు, సుప్రీంకోర్టులలో పిటిషన్ దాఖలు చేసి సెక్షన్ 17ఏ ను తొలగించమని కోరారని, అయితే ఇందుకు స్పందించిన సుప్రీంకోర్టు అరెస్టు సబబేనని చట్టబద్ధమైనదని తేల్చి చెప్పినట్లు, రానున్న రోజును మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జైలుపాలు కాక తప్పదు అంటూ జోస్యం చెప్పారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు పాల్గొన్నారు.
Comments