నా అభ్యర్థిత్వం ఖరారు - ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడి
వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
నా అభ్యర్థిత్వం ఖరారు - ఎమ్మెల్యే రాచమల్లు వెల్లడి.
ఈనెల 15వ తేదీ నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభం.
మా వైసీపీ కౌన్సిలర్ల ను టీడీపీ నాయకులు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యత్వం కోసం నేను మూడవ ధపా ఈనెల 15 వ తారీఖున రామేశ్వరం, అమ్మవారిసాల నందు పూజలు ముగించుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం నడింపల్లి లోని సమితి ఆఫీస్ వద్ద గల కౌన్సిలర్ జయ లింగారెడ్డి ఇంటి వద్ద వైసీపీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు తమ ప్రభుత్వం అనుకూలమని, నియోజకవర్గ పరిధిలో గడచిన 4 సంవత్సరాల 6 నెలలో ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. పార్టీలోని అందరు నాయకులను, కార్యకర్తలను కలుపుకొని రానున్న ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు అన్నారు. టిడిపి లోని వర్గపోరు తమకు అనుకూలమని, ప్రజా సమస్యలపై ఏనాడు పోరాడని టీడీపీ నాయకులు నేడు టికెట్ ఆశించటం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి రాజకీయాలను పదవిగా భావిస్తున్నారని, ప్రజల అభిమానాన్ని చూరగొనటంలో నమ్మకాన్ని కోల్పోయారని. ప్రజల కోసం తాను ఎల్లపుడూ అందుబాటులో ఉంటూ చేసిన అభివృద్ధిని దృష్టిలో వుంచుకొని రానున్న ఎన్నికలలో ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు. గత పదిహేను రోజుల నుండి తమ వైసీపీ కౌన్సిలర్ల ను టీడీపీ నాయకులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, దాదాపు 15 మంది కౌన్సిలర్ల దగ్గరకు వెళ్లి 12.5 లక్షల డబ్బులు ఇస్తాం అని వొత్తిడికి, ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇకనైనా ఇలాంటి పనులు టీడీపీ నాయకులు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకుల కోరిక ఫలించదని, ఎల్లప్పుడూ ఇక్కడి వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు తనవెంట ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎలక్షన్ కౌన్సిల్ కు త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు టీడీపీ నాయకులు 30 కొట్లు డబ్బు చూపుస్తెనే టీడీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందని, అలాగే ఇక్కడి స్థానిక నాయకత్వం వారికి సహకరించే విధంగా ఈ కొనుగోళ్ల పర్వం కొనసాగుతోందని ఆయన ఆరోపణలు గుప్పించారు. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా రాజకీయాల్లో మెలగాలని, అలా తాను వ్యవహరించటం వలనే నేడు మూడవ సారి తనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఖరారు చేసిందని ప్రకటించారు . తమ కౌన్సిలర్ల ను కొనుగోలు చేసె ప్రయత్నం చేసిన టీడీపీ నాయకులకు ప్రస్తుతానికి ఇలాంటి చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని, మరోమారు ఇదే జరిగితే దండన తప్పదని సూటిగా హెచ్చరించారు. సమావేశానికి రెండు మండలాల ముఖ్య నాయకులు, మునిసిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments