అభివృద్ధి పండుగ మొదలయ్యింది - రాచమల్లు
శనివారం ఉదయం ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం అని, మహిళల ఆర్థిక స్వావలంబనకు పూర్తిగా విఫలం అయ్యిందని, నాడు పదవుల వేటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాలన సాగించారని, విద్యా, వైద్యం లాంటి మౌలిక వసతులు కరువయ్యాయని, నియోజకవర్గంలో ప్రధాణంగా అయిదు కాలువలు, పైప్ లైన్ల ఆధునీకరణ, పేదలకు ఇంటి నిర్మాణాలు పూర్తి విఫలం కాగా, వ్యవసాయ రుణాల ఎగవేత, డ్వాక్రా మహిళల రుణాలు, నేతన్నల సమస్యలు గాలికి వదిలేయగా, ప్రొద్దుటూరుకు అభివృద్ధి ఫలాలు దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం నందు జరుగుతున్నాయని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, ఇప్పటికి ఇరవై నాలుగు వేల మందికి ఒక్క లక్ష ఇరవై వేల రూపాయల రుణాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నట్లు ఇందుకుగాను అయిదు వందల ఏకరాల భూమికి రెండు వందల కోట్లు కర్చు చేశామని, ఇకపోతే సంక్షేమ పథకాలకు మూడునర్ర సంవత్సరం కాలానికి, పారదర్శకంగా వేయి కోట్లు లబ్ధిదారులకు అందించామని, మౌలిక వసతులు కొరకు అయిదు వందల ఇరవై కోట్లు రూపాయల నిధులు మంజూరు కాగా 160 కోట్ల వ్యయంతో కాలువల నిర్మాణం, 24 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులు, 120 కోట్ల రూపాయలతో మైలవరం నుండి ప్రొద్దుటూరు కు త్రాగునీటి వసతి, 120 కోట్ల రూపాయల వ్యయంతో మునిసిపాలిటి పరిధిలోని 41 వార్డులలో కాలువలు, రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వివరిస్తూ, మొత్తం 3 వేల కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, కాగా గత ప్రభుత్వాలు అన్ని కలిసి కూడా 500 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని లెక్కలతో సహా వివరించారు.
రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఆధునిక వసతులతో నూతన మార్కెట్ నిర్మాణం ప్రొద్దుటూరులో చేపట్టనుండగా, ఇందుకుగాను భూమి పూజ కొరకు రాష్టంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు రానున్నట్లు, ప్రజల సమక్షంలో కార్యక్రమం జరగాలని ఆలోచించి ప్రతి రూపాయి తామే కర్చు చేయనున్నట్లు, తమ ప్రభుత్వ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, 15వ తారీఖున మునిసిపల్ కార్యాలయం నుండి ప్రజలతో ఊరేగింపుగా వెళ్లి భూమిపూజ లో పాల్గొననున్నట్లు, ఈ భూమి పూజ కార్యక్రమంలో దాదాపు 25వేల మంది ప్రజలు హాజరు కానున్నారని, అందరికీ భోజన వసతి సౌకర్యం కూడా కల్పించినట్లు ఆయన తెలిపారు. మరో ఒకటిన్నర సంవత్సరంలో అనగా మే 2024 నాటికి నూతన కూరగాయల మార్కెట్ ప్రజల అందుబాటులోకి రానున్నదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comentários