వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేడు మునిసిపల్ కార్యాలయంలోని మునిసిపల్ చైర్మన్ ఛాంబర్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు, రాష్ట్రము లో ప్రత్యేకించి ఒక ఛానల్ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి అని చూస్తున్నారని, వాస్తవాలను ప్రసారం చేయవలసిన సదరు మీడియా అవాస్తవాలు ప్రజలకు తెలుపుతోంది అని, యదార్ధం ప్రజలకు తెలపాలి అనే తపన తాపత్రయంతోనే నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశానని రాచమల్లు తెలిపారు. మతిస్థిమితం లేని దళిత మైనర్ బాలికను ఇంట్లో పనికి కుదుర్చుకొని, కామవాంఛతో పశువులవలె అత్యాచారం చేసి, స్నేహితులు పరిచయస్థులతో పలు దపాలుగా కామవాంఛ తీర్చుకున్నారని, ఏమి జరుగుతోంది తెలియని అయోమయ స్థితిలో బాలిక మానసిక పరిస్థితి, ఇదే క్రమంలో గర్భం దాల్చిన అమ్మాయి, ఏడవ నెల రావటంతో, ఈ నెల 4వ తారీకున సచివాలయ సిబ్బంది గుర్తించి మహిళా పోలీసు ఒకటవ పట్టణ సిఐ కి బాలికను తీసుకువెళ్లగా, సీఐ విచారణ జరిపిన సరైన వివరాలు వెల్లడించలేదని. కొద్దిసేపు కొన్ని పేర్లు, మతికొద్దిసేపు మరి
కొందరి పేర్లు చెప్పటంతో మతిస్థిమితం లేదని పోలీసులు తేల్చారన్నారు. ఇదిలా ఉండగా డాడీ హోమ్ కు అమ్మాయిని పోలీసులు తరలించారన్నారు. ఓకే మీడియా ఛానల్ దుష్ట బుద్ధితో వారికి కావలసిన విధంగా బాలికతో మాట్లాడించారని, అయితే ఇది అత్యాచారం కాదు... నమ్మించి కామవాంఛ తీర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మాయి జీవితం నాశనం అయినా పర్లేదు, టీడీపీ వారు ఈ సంఘటనను రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారన్నారు. నేను కూడా పురుషుడు అయినందుకు సిగ్గుతో తల దించుకుంటున్న అని ఒకానొక సందర్భంలో జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే రాచమల్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో సదరు మీడియా వారు, టీడీపీ పార్టీ వారు పోలీసులను విమర్శించటం తగదన్నారు. పోలీసులు అన్ని కోణాలలో లోతుగా విచారించి కేసులు నమోదు చేశారని, ఏ నేరం చేశారని పోలీసులను సస్పెండ్ చెయ్యాలి అని టీడీపీ వారు కోరుతున్నారో తమకు అర్థం కావటం లేదన్నారు. అధికారులు తప్పు చేసివుంటే పై అధికారులకు పిర్యాదు చెయ్యాలి తప్ప ఇలా పోలీసులపై నిందలు మోపటం సరికాదాని, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు సిఐ ని సస్పెండ్ చేయండి అనటం హాస్యాస్పదం అన్నారు. పై ఘటనలో వైసీపీ కి చెందిన ముస్లిం కౌన్సిలర్ లు ఉన్నారని అంటున్నారని దీని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. టీడీపీ వారు నాయకులు గా చలామణి కావాలంటే... ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం సబబు కాదని హితువు పలికారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం ఇస్తోంది వైసీపీ ప్రభుత్వమే నని, పోలీసులకు బిడ్డలు ఉన్నారని ఈ సంఘటనలో వారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు.
తాను అధికార దుర్వినియోగం చేసివుంటే టీడీపీ వారి మీద తాము ఎన్ని కేసులు పెట్టాము అని, పోలీసులు వైసీపీ వారి మీద కూడా కేసులు నమోదు చేశారని గుర్తు చేశారు, టీడీపీ వారికి స్వేచ్ఛ ఎక్కువ కావటం వలన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చమత్కరించారు.
ఇకపోతే బాధిత దళిత మైనర్ బాలికకు పుట్టబోయే బిడ్డ సంరక్షణ తన బాధ్యత అని ఎమ్మెల్యే రాచమల్లు ఒక ప్రకటన చేశారు.
コメント