నా మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణ కోరుతున్న - ఎమ్మెల్యే రాచమల్లు
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మద్యం పాలసీలో లోపాలున్నాయంటూ, ప్రజలకు ఉన్న సమస్యను ఎస్.ఈ.బి అధికారులకు తెలపాలన్న సదుద్దేశంతోనే తాను ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివరించారు. చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేసిన ఆయన, గురువారం జరిగిన సంఘటనకు, తాను ప్రవర్తించిన తీరు, మాట్లాడిన విధానం, ఎస్పీ స్థాయి అధికారిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ కోరుతున్నట్లు ఎమ్మెల్యే రాచమల్లు పత్రికాముఖంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, తాను ఒక బాధ్యత గల వ్యక్తిని అని అయితే నిన్న జరిగిన సంఘటన, వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు, సబబు కాదని అలా తాను వ్యవహరించి ఉండకూడదని, అయితే తన వాడుక భాషా ప్రయోగం, పదజాలం ద్రోల్లి అలా మాట్లాడవలసి వచ్చిందని తన మాటలు అధికారులకు బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు. కడప జిల్లా పోలీసు అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు తమ బాధ్యతలు చక్కగా నిర్వహిస్తున్నట్లు ఆయన కితాబిచ్చారు.
Comments