పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు
రాజుపాలెం మండలంలోని వెంగలాయా పల్లే గ్రామంలో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజక వర్గ శాసన సభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పల్లే ప్రగతి కార్యక్రమంలో పాల్గొని ,ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యంగా పేద వారిని దళితులను కలుసుకొని, ప్రభుత్వం పేద వారికి కలిపిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ,ప్రజా సమస్యలను వింటూ,సమస్యలున్న చోట వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలుపుతూ పల్లే ప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించారు.అలాగే రచ్చ బండ కార్యక్రమంలో ఎనిమిది వందల జనాభా ,ఆరు వందల మంది ఓటర్లు వున్న గ్రామానికి సరియైన రోడ్లు,డ్రైనేజీ కాలువలు, తాగు నీటి పైపు లైన్ల కొరకు 50 లక్షల రూపాయలు అవసరం పడుతుంది అని తెలుసుకొని,వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే తమ గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాచమల్లు కు గ్రామ సర్పంచ్ దనిరెడ్డి రేణుకమ్మ,నాయకులు అంకిరెడ్డి,వెంకట సుబ్బారెడ్డి,శ్రీనివాసుల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,వెంకట రామిరెడ్డి, కార్యకర్తలు ,అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజనీ కుమారి, గోపాల్లే గోవర్దన్ రెడ్డి,ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి,మండల ఉప అధ్యక్షులు నారాయణ రెడ్డి,నాయకులు శేఖర్ రెడ్డి,రాజారాం రెడ్డి,వెంకట రెడ్డి, బలరామి రెడ్డి,పలువురు నాయకులు, కార్యకర్తలు అభిమానులు,మండల స్థాయి అధికారులు,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు పాల్గొన్నారు.
Comentários