వడ్డీ డబ్బులు మాత్రమే కట్టించుకుని పంట రుణాలను రెన్యువల్ చేసుకునేలా చూడాలి - కలెక్టర్ ను కోరిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
పంటల సాగు కోసం రైతులు బ్యాంకుల యందు తీసుకున్న రుణాల రెన్యువల్ లలో వడ్డీ డబ్బులు మాత్రమే కట్టించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గిరీషాను ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి కోరారు. బ్యాంకుల యందు పంట రుణాల రెన్యువల్స్ పై కలెక్టర్ తో శ్రీకాంత్ రెడ్డి ఫోన్లో చర్చించారు. ఆంధ్రపగతి గ్రామీణ బ్యాంక్ కొన్ని శాఖలు మరియు ఇతర బ్యాంకులు పంట రుణాల రెన్యువల్స్ లలో అసలు మరియు వడ్డీ డబ్బులు తీసుకుంటుండడం వల్ల రైతులు కష్ట, నష్టాలను ఎదుర్కొంటున్నారని, అసలు డబ్బు కోసం దళారుల దగ్గర రూ 5, రూ 10 వడ్డీలు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు.
రైతుల ఇబ్బందుల దృష్ట్యా రైతుల దగ్గర వడ్డీలు మాత్రమే తీసుకుని వ్యవసాయ రుణాలును రెన్యువల్ చేసేలా చూడాలని కోరగా ఇందుకు స్పందించిన కలెక్టర్ గిరీష బ్యాంకు అధికారులుతో మాట్లాడి వడ్డీ డబ్బులుతోనే పంట రుణాలను రెన్యువల్ చేసుకునేలా తక్షణమే ఆదేశాలు ఇస్తామన్నారు. బ్యాంకు అధికారులు కూడా వడ్డీ డబ్బులుతోనే
పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కోరారు.
Comments