రంజాన్ కు సర్వాంగ సుందరంగా ఈద్గాలను తీర్చుదిద్దాలి, ఈద్గాల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి.
రంజాన్ పండుగకు పట్టణంలోని ఈద్గాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులుకు ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి సూచించారు.శనివారం మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, మత పెద్దలు డా హుసేనీ, ఈద్గా కమిటీ బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్లు , మైనారిటీ నాయకులుతో కలసి పట్టణంలోని ఈద్గాను, పాత రాయచోటిలోని పాత ఈద్గాను శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. రూ 15 లక్షలు నిధులుతో పూర్తిచేసిన కల్వర్టు నిర్మాణాలును, ఎంపి మిథున్ రెడ్డి రూ 18 లక్షల నిధులుతో పూర్తి కావచ్చిన అభివృద్ధి పెండింగ్ పనులు, పెయింటింగ్ పనులును ఆయన పరిశీలించారు. జిల్లా కేంద్రంలో తొలిసారిగా జరగనున్న రంజాన్ మాసంలో ఈద్గా ప్రార్థనలుకు ఈద్గాను ప్రత్యేక అలంకరణలును చేపట్టాలన్నారు. త్రాగునీటి వసతి కల్పించాలని ఆయన అధికారులును సూచించారు.పాత ఈద్గాకు వెళ్లే రహదారిని కూడా శ్రీకాంత్ రెడ్డి మరమ్మత్తులు చేయించడంతో స్థానిక మైనారిటీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గౌస్ ఖాన్, అన్న సలీం, ఈద్గా కమిటీ సాదక్, గౌస్ పీర్, కో ఆప్షన్ అయ్యవారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comentarios