గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, మన పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే పూర్ణ ఆరోగ్యంతో ఉంటామని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ 74 వ వార్డు బి సి రోడ్డు గాంధీ విగ్రహం వద్ద ఆ వార్డు వైసిపి కార్పొరేటర్, జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, జిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బిసి రోడ్డు చైతన్య పాఠశాలలో స్వచ్చ్ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగిరెడ్డి పాల్గొని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడుతూ మన నివాసంలోనే కాకుండా మన పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో మన విశాఖ నగరానికి ప్రధమ స్థానంలో నిలవాలంటే ప్రజలందరి సహకారంతోనే సాధ్యపడుతుందని చెప్పేరు. కార్పొరేటర్ వంశీరెడ్డి మాట్లాడుతూ స్వచ్ సర్వేక్షన్ 2022 దేశంలో విశాఖను ప్రధమ స్థానంలో నిలబెట్టాలని వార్డు
ప్రజలకు పిలుపునిచ్చారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మనతోపాటు భవితరాలకు మంచి ఆరోగ్యాని ఇచ్చే భాద్యత మనందరిపై ఉందన్నారు. తడి చేత్త, పొడి చేత్త, ప్రమాదకరమైన చేత్తలను వేరు వేరుగా వేరిచేసి ఇంటి వద్దకు వచ్చిన వాహనాలలో వెళ్ళయాలని సూచించారు. అనంతరం తడి, పొడి, ప్రమాదకరమైన చేత్త బుట్టాలను ఆయన స్థానికలకు అందచేశారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలనీ, ప్లాస్టిక్ కవరలను నిషేధించి, గుడ్డ సంచులను ప్రజలు అందరూ ఉపయోగించాలని జోనల్ కమిషనర్ డి శ్రీధర్ స్థానికలను కోరారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో స్వచ్ సర్వేక్షణ్ పై ప్రతిజ్ఞ చేయించారు. పారిశుధ్య కార్మికులును శాలువా, పూల దండలతో సతకరించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ వైద్య అధికారి కిరణ్ కుమార్, జీవీఎంసీ సిఓ సూర్యనారాయణ, స్కూల్ ప్రిన్సిపాల్ కనకవల్లి, సచివాలయం సిబ్బంది, వాలంటీరీలు, ద్వాక్ర మహిళలు, వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తొలత పారిశుధ్య వాహనాలను ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతులమీదగా ప్రారంభించారు.
Comments