ఉక్కు నగరం, YSRTUC యూత్ వింగ్ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కై నిర్వహించిన online slogan & essay writing competition లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలను గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి అందజేశారు.
ఉక్కు నగరం వై ఎస్ ఆర్ టి సి ఆఫీస్ వద్ద యువ కార్మికుడు నల్లబల్లే సూర్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగార ప్రతిపాదన నుండి శంకుస్థాపన వరకు ముగ్గురు భారత ప్రధానులు మారారని, ఉక్కు కర్మాగారం కోసం ఆనాడు దక్షిణాది రాష్ట్రాల మధ్య పోటీ నెలకొన్నదని, అమృత రావు గారు, తెన్నేటి విశ్వనాథం గారు వంటి మహనీయుల పోరాటం, 32 మంది ప్రాణత్యాగం ఫలం, భూ సేకరణలో నిర్వాసితుల సహకారం ఇలా అనేకమంది కృషితో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మిత మైనదని, వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని ,విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకుంటామనే సంపూర్ణ విశ్వాసం ఉందని ఎమ్మెల్యే అన్నారు.
కాంపిటీషన్ లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూన్నని, విశాఖ ఉక్కు ఉద్యమం గురించి విద్యార్థుల్లో అవగాహన పెంచుతూ మరియు పరిరక్షణ ఉద్యమంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తున్న YSRTUC యువ కార్మికులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో వై మస్తానప్ప, దేవుపల్లి సంపూర్ణం, M. N. రెడ్డి, మార్టుపూడి పరదేశి, పిట్ట రెడ్డి, ఎల్లగడ ఈశ్వరరావు, గెద్దాడ అప్పలరాజు, దాసరి పుల్లారావు, పరమానంద బిసాయి, వేంపాడ వరప్రసాద్, వై కోటి సూర్య ప్రకాష్, చంద్రశేఖర్ శకునాల, పాలకీర్తి బ్రహ్మయ్య, నడుపూరు అనిల్, పులిదిండి వంశి, గెద్దాడ నాగరాజు, చిత్రాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comentarios