గాజువాక ప్రసన్న ఆంధ్ర విలేకరి
సర్వ జనాభివృద్ది సంపూర్నాభివృద్దే లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ - ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన జిల్లాలను ఆవిష్కరించిన సందర్భంగా గాజువాక నియోజకవర్గం లో వైసీపీ నాయకులు సంబరాలు మూడవ రోజు కొనసాగాయి. పెదగంట్యాడ పరిధిలో 64,65,74,75,76 వార్డు కార్పొరేటర్లు , ఇంఛార్జి లు ఆధ్వర్యంలో జిల్లాలు పునర్విభజనను స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. బీసీ రోడ్ TNR ఫంక్షన్ హాల్ నుంచి పెదగంట్యాడ సెంటర్ వరకు పాద యాత్ర చేపట్టి అనంతరం బహిరంగ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి , నియోజక వర్గ ఇంఛార్జి తిప్ప ల దేవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురు మూర్తి రెడ్డి, వెంకట రామయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి ఏ ఒక్క వర్గనికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు బడుగు బలహిన వర్గాలకు చెరువుగా ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సంకల్పం అని ప్రజా పరిపాలన సౌలభ్యం చేసేందుకు నూతనంగా ఏర్పాటు అయిన జిల్లాల్లో సమర్థవంతమైన నూతన అధికారులను నియమించడంతో పాటుగా రెవెన్యూ డివిజన్ లను ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమని, అందరికీ మేలు చేసే నిర్ణయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న సందర్భంగా ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ స్వాగతిస్తూ కొత్త జిల్లాల ఆవశ్యకత, కొత్త జిల్లాల వల్ల కలిగే మేలు, తెలియ జేసెందుకు ఐదు రోజుల పాటు గాజువాక నియోజకవర్గంలో ఉత్సవాలు చేపట్టడం జరిగిందని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏటువంటి అవినీతి కీ తావు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ను వలంటిరు వ్యవస్థ ను స్థాపించి అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటి వద్దకు వస్తున్నాయని అన్నారు.
అదేవిధంగా నూతన జిల్లాలు ఏర్పడడంతో భూ సంబంధిత, అభివృద్ధి, ఉపాధి, వైద్య, హౌసింగ్ కు సంబంధించి పునర్విభజన ద్వారా మెరుగైన పాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పునర్విభజన చేపట్టడం జరిగిందన్నారు.
నియోజక వర్గ ఇంఛార్జి తిప్పల దేవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మరింత చెరువుగా పాలన అందించాలని, అన్ని ప్రాంతాలు సమతులాభివృద్ది చెందాలని, నవ శకానికి నాంది పలుకుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసారని చరిత్ర లో నిలిచిపోయే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేటర్లు తిప్పల వంశీ రెడ్డి, బొడ్డు నరసింహ పాత్రుడు, భూపతి రాజు సుజాత,dcms చైర్మన్ పల్లా చినతల్లి, డైరెక్టర్ యువ శ్రీ, భోగాధి సన్ని, ధర్మాల శ్రీను, దొడ్డి రమణ, మారుడి పూడి పరదేశి, గంట్యాడ గురుమూర్తి, గొందేసి బుజ్జి, కోమటి శ్రీను, రోజా రాణి, నక్క రమణ , మద్దాల అప్పారావు , గొందేశి మహేశ్వర రెడ్డి, రెడ్డి జగన్నాధం,సీనియర్ నాయకులు, వార్డు అధ్యక్షులు,,బూత్ కన్వీనర్లు, సభ్యులు,మహిళా నాయకురాల్లు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments