అలా మాట్లాడడం వారి అజ్ఞానానికి వదిలేస్తున్నా - ఎమ్మెల్యే వరద
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం ఆనవాయితీ సంప్రదాయంగా మారిందని, గత ప్రభుత్వాలలో కూడా ఇలానే జరిగిందని, కానీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సంప్రదాయానికి విరుద్ధంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం వారి అజ్ఞానానికే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక నెహ్రూ రోడ్డులోని టిడిపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో రషీద్ హత్య పాత కక్షల కారణంగానే జరిగిందని, ఈ హత్యను రాజకీయ కుట్ర కోణంలో జరిగిన హత్యా అని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నాయకులను కార్యకర్తలను ఎంతమందిని అంతమొందించారో జగన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నిస్తూ? రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడటం దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఏనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదని, జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరించారని, అందుకే నేడు అధికారం కోల్పోయి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టిడిపి నాయకులు ఎర్రన్న, తలారి పుల్లయ్య, ఆంజనేయరెడ్డి, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Commenti