వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు రాజుపాలెం(మం) పగిడాల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జగనన్న పల్లే ప్రగతి కార్యక్రమము లో ప్రొద్దుటూరు శాసన సభ్యులు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ ప్రజా సమస్యలను వింటూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు. అలాగే గ్రామానికి 15 ఎల్ ఈ డీ వీధి దీపాలు. నీటిసుద్ది యంత్రాన్ని,, నూతన కాలువలు ఏర్పాటు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల ను ప్రజలకు సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకొని,ప్రజా సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు.అలాగే గ్రామంలో ఎప్పుడూ ప్రజా సేవకుడిగా ముందుండే బలరామిరెడ్డి కి అన్ని విధాల సహకరించి గ్రామాన్ని అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా తన గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాచమల్లుకు ముందుగా గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కానాల బలారామి రెడ్డి ఆయన సతీమణి వెల్లాల దేవస్థాన చైర్మన్ కానాల విజయ లక్ష్మి,సర్పంచ్ కానాల రాధ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంజనీ దేవి, గోపల్లీ గోవర్దన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి,శేఖర్ రెడ్డి,నియోజక వర్గ స్థాయి,మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Comments