ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడానికి ముందుంటానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం వి రామచంద్రారెడ్డి అన్నారు.
గత ఇరవై సంవత్సరాల నుండి ప్రైవేట్ పాఠశాలల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించానని, అదే విధంగా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుమారునిగా తనకు ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నానని, వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని, తనను నమ్మి ప్రైవేటు ఉపాధ్యాయులు అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని, అలాగే ముప్పై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు తనకు రెండు కళ్ళ లాంటి వారిని, ఇద్దరినీ సమాన దృష్టితో చూసి వారి సమస్యలను ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి పరిష్కార మార్గాలను చూపుతానని, రాబోవు ఎమ్యెల్సీ ఎన్నికలలో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా ఆయన అభ్యర్ధించారు. ఈనెల 22వ తేదీన అనంతపురం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామాంజనేయులు సుబ్బరాజు యాదవ్, ప్రొద్దుటూరు నాయకులు భాస్కర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, షఫీ, ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments