పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలి - రాంగోపాల్ రెడ్డి
వై ఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీనువాసులరెడ్డి మంగళవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు టీడీపీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తనను విమర్శించడం సరికాదు అని, కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మాత్రమే నాడు టీడీపీ ర్యాలీ నిర్వహించామని, ర్యాలీని చూసి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బయపడ్డారా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోతాడానే భయం ఎమ్మెల్యేకి కలిగిందని ఏడ్డేవాచేసారు.
అనంతరం పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ శాసనమండలి అభ్యర్ది భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ శాసన మండలి అభ్యర్దిగా గెలిపించాలని అభ్యర్థించారు. 2024లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలు భర్తీ చేస్తుందని, విద్యావంతులు తనను గెలిపించి టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అభ్యర్థించారు. అనంతరం విద్య ఆగ్రహ దీక్ష గోడ పత్రికలను ఆవిష్కించారు.
కార్యక్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టిఆర్ అభిమానులు పాల్గొన్నారు.
Comments