జిల్లా ప్లీనరీ సమావేశం జయప్రదం చేయండి - ఎంమ్మెల్సీ రమేష్ యాదవ్
వై.ఎస్.అర్ జిల్లా, ప్రొద్దుటూరు
నేడు 22వ వార్డు వైసీపీ కౌన్సిలర్ వై.ఎస్ మహమ్మద్ గౌస్ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు ఎంమ్మెల్సీ రమేష్ యాదవ్, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, వైస్ చైర్మన్ ఖాజా, కౌన్సిలర్లు గౌస్, మునీర్, వంగనూరు మురళీధర్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా పట్టణంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సందర్భంగా ఎంమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ తన తండ్రి మునిసిపల్ చైర్మన్ గా ఉన్నపటినుండి ముస్లిం మైనారిటీ సోదరులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నామని, తనకు పలు సందర్భాలలో మైనారిటీలు వెన్నంటి ఉన్నారని గుర్తు చేశారు. 2017లో జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాల అనంతరం తిరిగి 2019వ సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక, ఈ 2022వ సంవత్సరంలో వైసీపీ నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరుపుకుంటోందని, ప్రజలు జగన్ సర్కార్ వైపు ఉన్నారని, తాజాగా తనను సీఎం జగన్ ఆదేశానుసారం చిత్తూరు జిల్లా ప్లీనరీ సమావేశాల ఇంఛార్జిగా నియమించగా, చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో, అలాగే జిల్లా ప్లీనరీ సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై సమావేశాలను జయప్రదం చేశారని తెలిపారు.
రేవు కడపలో జరగనున్న వైఎస్సార్ కడప జిల్లా ప్లీనరీ సమావేశాలకు తమ వర్గం 250 నుండి 300 వాహనాలలో కొనిరెడ్డి ఆయిల్ మిల్ దగ్గర నుండి బయలుదేరి గాంధీ రోడ్డు, శ్రీరాములపేట, మైదుకూరు రోడ్డులోని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం కడప ప్లీనరీకి వెళ్లనున్నట్లు తెలిపారు, కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సమావేశాలను జయప్రదం చెయ్యాలని కోరారు. సమావేశంలో కొనిరెడ్డి మాట్లాడుతూ గవిని దర్గా చెట్టు ప్రహారి గోడ కూల్చివేతతో ముస్లిం మైనారిటీ సోదరుల మనోభావాలు దెబ్బతినగా, వారితో చర్చించి పరిస్థితిని సమీక్షించి, తాను కూడా సంఘీభావం తెలిపానని, రానున్న రోజుల్లో అందరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments