నైతికతే నిజమైన స్వేఛ్ఛ
దేశ వ్యాప్త జాగృతి ఉద్యమం 2024 సెప్టెంబర్ 1నుండి 30 వరకు.
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
జమాఅతె ఇస్లామి హింద్ ప్రొద్దుటూరు శాఖ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఖాదర్ హుస్సేన్ మస్జిద్ వీధిలోని మద్రసలొ మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో పట్ణణ అధ్యక్షురాలు హసినా మాట్లాడుతూ, జమాఅతె ఇస్లామి హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈనెల సెప్టెంబరు 1 నుండి 30తేదీ వరకు నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో ఒక జాతీయ స్థాయి ఉద్యమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రొద్దుటూరులొ ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం కడపజిల్లా అధ్యక్షురాలు రెహన మాట్లాడుతూ, నేడు స్వేచ్ఛ అంటే కళ్లెంలేని గుర్రంలా ఇష్టమొచ్చినట్లు జీవించడం,లేట్ నైట్ పబ్ కల్చర్ నచ్చినట్లు ఉండటం,ఇదే ఇప్పుడు స్వేచ్ఛగా మారిపోయింది. ఎలాంటి హద్దులు లేకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడమే స్వేచ్ఛగా భావిస్తున్నారని ఈ మితిమీరిన స్వేచ్ఛ ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని, నైతికత లేని స్వేచ్ఛ సమాజాన్ని ఎటు తీసుకెళుతుందో నిత్యం జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. నైతికంగా దిగజార్చే స్వేచ్ఛ నిజమైన స్వేచ్ఛ కాదని నైతికతే నిజమైన స్వేచ్ఛ అని నైతికత విలువలను పెంపోదించుకునెందుకు తాము ఈ 30రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమాలు, కరపత్రాల ద్వారా, కార్నర్ మీటింగ్స్, సోషల్ మీడియా లొ లఘు చిత్రాల ద్వారా, మరియు కాలేజ్ లలో విద్యార్థి, విద్యార్థులకు నైతిక విలువల ప్రాధాన్యతను వివరిస్తూ పలు జాగృతి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉద్యమ కన్వీనర్ ఆయిషా, మహబూబ్ చాన్, గులాబ్ జాన్, ఆయిషా కౌసర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యమ పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments