పిల్లల శారీరక మానసిక ఎదుగుదల లక్ష్యంగా అంగన్వాడీలు పనిచేయాలని చిట్వేల్ ఎంపీడీవో సమత పిలుపునిచ్చారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూర్వ ప్రాథమిక విద్య పై స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడి టీచర్లకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ లను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ బాలల భవిష్యత్తు అంగన్వాడీ టీచర్ ల పై ఆధారపడి ఉందని గుర్తు చేశారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు పిల్లలందరూ ముందుగా అంగన్వాడి లోనే తమ బాల్యాన్ని ప్రారంభిస్తారని అన్నారు. అలాంటి చిన్నారుల్లో పునాది గట్టిగా వేయగలిగితే భవిష్యత్తు జీవితం కోరుకున్న విధంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థ పటిష్టంగా పని చేయడానికి ఎన్నో కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని తెలిపారు. గర్భిణిలు, బాలింతలు, ఆరు సంవత్సరాల పిల్లల వరకు అనగా వెయ్యి రోజుల సంరక్షణ పూర్తిగా అంగన్వాడీల దేనని గుర్తుచేశారు.
అనంతరం చిట్వేల్ ఎంపీపీ చంద్ర మాట్లాడుతూ మండలంలో అంగన్వాడి టీచర్లకు సౌకర్యాల పరంగా ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందు ఉంటానని హామీ ఇచ్చారు. తదనంతరం అంగన్వాడి గ్రేడ్ వన్ సూపర్వైజర్ లు నిర్మల, రాజేశ్వరి, గుణవతి లు అంగన్వాడి టీచర్లకు ఈ సి సి ఈ డే గురించి, పాఠశాల సంసిద్ధత మేలా గురించి, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరపాల్సిన" పోషన్ పక్వాడ్ సంబరాల" గురించి అంగన్వాడి స్కూల్ లలో నిర్వహించాల్సిన రిజిస్టర్ నిర్వహణ, స్కూల్ పరిశుభ్రత ,పౌష్టికాహార పంపిణీ, తదితర అంశాల గురించి వివరించారు. తదుపరి మూకుమ్మడిగా ముందస్తు ఉగాది సంబరాలను జరుపుకున్నారు.
Opmerkingen