సమిష్టి కృషితో మండల అభివృధి -
ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి.
నందలూరు మండలం లోని మండల పరిషత్ కార్యాలయం ఎంపిడిఓ సౌభాగ్యం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల సమాఖ్య కార్యక్రమం నకు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన భాధ్యత అధికారుల పై ఉందని అన్నారు. అలాగే గడప గడపకు అను కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలకు అధికారులు సరైన రీతిలో స్పందించి వీలైనంత త్వరలో ఆ సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డాక్టర్లు తమ సిబ్బందితో పకడ్బందీగా పూర్తి చేయాలని ఆయన అన్నారు, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎం ఈ ఓ పైనే ఉంది అని తెలియజేశారు. బస్టాండ్ కూడలిలో చిన్న వర్షం పడితే నీరు రోడ్లపై నిలబడి ఉందని దానిని రోడ్డు పక్కన చెరువు కాలువ ఉందని అందులో పైపులు అమర్చి అక్కడ నీళ్లు నిలబడకుండా చేయాలని రోడ్లు మరియు భవనాల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అనిల్ కుమార్ కు సూచనలు ఇచ్చారు అందుకు ఆయన పది రోజుల్లోనే ఆ పనిని పూర్తి చేస్తామని ఎంపీపీకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు గడికోట ఉషా సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నాయన పల్లి అనుదీప్ జై సింహ, అన్నమయ్య జిల్లా వక్స్ బోర్డ్ సభ్యులు సయ్యద్ అమీర్ మండల డిప్యూటీ తాసిల్దార్ మోహన్ కృష్ణ , ఏ ఎస్ ఐ శంకర్ నాయక్, ఈ.ఓ.పి ఆర్. డి. సతీష్, మండలానికి సంబంధించిన అధికారులు, సిబ్బంది, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Comments