వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సోములవారిపల్లె పంచాయతీ సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీపీ శేఖర్ యాదవ్ అధ్యక్షతన గత నాలుగు రోజులుగా పంచాయతీ పరిధిలోని ఒకటవ సచివాలయం ఈశ్వర్ రెడ్డి నగర్ నందు జరుగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి స్థానిక ప్రజలు బ్రహ్మరధం పట్టి సాదర స్వాగతం పలికారని, నేటి నుండి రెండవ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు, సోములవారిపల్లె పంచాయతీలో గత ప్రభుత్వంతో పోలిస్తే అభివృద్ధి మెండుగా జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు సర్పంచ్ మోపురి ప్రశాంతి.
ఈ సందర్భంగా ఎంపీపీ శేఖర్ యాదవ్ మాట్లాడుతూ ఒకటవ సచివాలయ పరిధిలో సంక్షేమ పధకాల ద్వారా లభ్డిదారులకు పదమూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల నగదు అర్హులను గుర్తించి బదిలీ చేయటం జరిగిందని, పంచాయతీ పరిధిలో ఇంటింటికి కసువు సేకరణ కొరకు ఎమ్మెల్యే సొంత నిధులతో ట్రాక్టటర్లు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఎంపీ నిధులతో దాదాపు డెబ్భై శాతం మౌలిక వసతులు ఒకటవ సచివాలయ పరిధిలో పూర్తి చేశామని, మూడు వందల ముప్పై ఎనిమిది మందికి ఇంటి స్థలాలు ఇవ్వటం జరిగిందని, సచివాలయ పరిధిలో ఆర్బికె, మిల్క్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, టీడీపీ హయాంలోని పదహారు వందల పెన్షన్లను పునరుద్ధరించి నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఆరు వందల డెబ్భై పెన్షన్లు ఇస్తున్నామని, సచివాలయ పరిధిలో త్రాగునీటి, శానిటేషన్, లైటింగ్ సమస్యలు లేవని, నూతన పైప్లైన్ల ద్వారా ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నామని, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి నాయకత్వంలో పంచాయతీని అభివృద్ధి పధంలో నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ గోటూరు వెంకటేష్, పలువురు వార్డు సభ్యులు, మునిసిపల్ కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments