చిట్వేలి మండల తాసిల్దార్ మురళీకృష్ణ.
రాగల మూడు రోజుల్లో మాండూస్ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుక పటిష్ట చర్యలను చేపడుతున్నామని చిట్వేలి మండల తాసిల్దార్ మురళీకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో కలిసి సంయుక్త సమావేశం నిర్వహించారు. తాను మాట్లాడుతూ.. మూడు రోజులు పాటు మాండూస్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందుగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మండల అధికారులందరూ అందుబాటులో ఉండి గ్రామస్థాయి అధికారులకు తగు సలహాలు సూచనలు చేస్తూ అందరం సంయుక్తంగా పనిచేస్తూ ఈ విపత్తును అధికమించాలని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఉదృతంగా ప్రవహించే నదులు వాగులు దాటవద్దని తెలిపారు.7674950721,9701678023,9848845078. ఈ నెంబర్లతో మండల పరిధిలో కంట్రోల్ రూమ్ అందరికీ అందుబాటులో ఉంటుందని ఎలాంటి ఇబ్బంది కలిగిన తెలియపరచాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మభూషణ్ రెడ్డి, ఆర్ఐ శేషం రాజు, ఎంఈఓ మహేశ్వరరావు, విద్యుత్ ఏఈ చలపతి, గృహ ఏఈ సుధాకర్, ఏపీవో చంద్రకళ, ఐసిడిఎస్, ఆరోగ్య,పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments