ఈ క్రాప్ నమోదు తోనే...నష్టపరిహారం సాధ్యం.
--- క్షేత్ర పర్యటనలో తాసిల్దార్ మురళీకృష్ణ.
అన్నమయ్య జిల్లా చిట్వేలు మండల పరిధిలోని పలు గ్రామాలలో ఈ క్రాప్ నమోదు కార్యక్రమాన్ని ఈ రోజున మండల తాసిల్దార్ మురళీకృష్ణ ఏఎస్ఓ దామోదర్ నాయుడుతో కలిసి మార్గోపల్లి, నగిరిపాడు, కంపసముద్రం గ్రామాలలో పర్యటించి వ్యవసాయ మరియు రెవిన్యూ అధికారులు సంయుక్తంగా కలిసి చేపడుతున్న ఈ పంట నమోదును సమీక్షించారు.
ఈ సందర్భంగా తాసిల్దార్ మురళీకృష్ణ మాట్లాడుతూ... రైతులు పంట సాగు చేయు ప్రతిసారి ఈ క్రాప్ ద్వారా తమ పంటను నమోదు చేసుకుని విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వం నుంచి చేకూరే లబ్ధి పొందాలని సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో ఆయా సచివాలయ పరిధిలోని వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో త్వరితగతిన నమోదును పూర్తి చేయాలని సూచించారు. కాగా ఈ ఖరీఫ్ సీజన్ కు గానూ మండల పరిధిలో 3000 ఎకరాలకు ఈ క్రాప్ కార్యక్రమం జరుగుతూ ఉందని; ఇందులో సుమారు 1500 ఎకరాలు మేర పూర్తి అయిందని, కేఎస్ అగ్రహారంలో 90 శాతం మేర పూర్తికాబడిందని ఇందులో బొప్పాయి, అరటి, పసుపు, స్వల్పకాలిక పంటలైన గుమ్మడి, సజ్జ, మొక్కజొన్న తదితర పంటలు ఉన్నాయని తాను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సదరు గ్రామాల వ్యవసాయ అధికారులు కళ్యాణ్, శ్రీవాణి; గ్రామ రెవెన్యూ అధికారులు ఉదయ్, సునీల్ మరియు సంబంధిత రైతులు పాల్గొన్నారు.
Commentaires