మానవత్వం చాటుకున్న మండల తహసిల్దార్ సత్యానంద్
నందలూరు మండలంలోని కొమ్మూరు గ్రామంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఆ గ్రామానికి చెందిన వెలగచర్ల సుబ్బమ్మ (68) ఇంటిలోని రేకుల పందిరి కింద నిద్రపోతున్న సమయంలో వర్షానికి పందిరి నాని దాని కింద ఉన్న కోయలు ఆమె మీద పడడంతో మరణించిందని తాసిల్దార్ కి సమాచారం రావడంతో బుధవారం ఆయన ఆ గ్రామాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆమె భర్త వెలగచర్ల రాజన్న ను వివరాలు అడిగి తెలుసుకుని వారి పరిస్థితి గమనించి తాసిల్దార్ తన నుండి పదివేల రూపాయలు మొత్తాన్ని వారికి ఇవ్వడం జరిగింది. తమ కష్టాన్ని చూసి తాసిల్దార్ సత్యానందం మాకు ఈ విధంగా సహాయం చేయడం ఆయనను మేము మరువ లేమని రాజన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
ความคิดเห็น