మాదిగల సత్తా చాటుతాం - ఎం.ఆర్.పీ.ఎస్, ఎం.ఎస్.పి, ఎం.ఈ.ఎఫ్
ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలంలోని గోపాయపల్లె చెక్ పోస్టు దగ్గర కు నంద్యాల జిల్లా చాగలమర్రి నుండి 27వ తేదీ ఉదయం కడప జిల్లాలో మాదిగల సంగ్రామ పాదయాత్ర ప్రవేశిస్తుందని ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా కో.కన్వీనర్ ఇల్లూరి శివశంకర్ మాదిగ, ఎం.ఆర్.పీ.ఎస్, ఎం.ఎస్.పి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం.నరసింహులు మాదిగ లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27వతేది సోమవారం వెల్లాల మీదుగా పగిడాల మాదిగ పల్లె చెరుకోని ఎం.ఆర్.పి.ఎస్ జెండా ను ఆవిష్కరించి, అక్కడి నుండి అరక్కటవేముల చేరుతుందాని, మాదిగ బిడ్డ లతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎస్.సి వర్గీకరణకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సవరణలు చేస్తామని చెప్పిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలను దగా చేసిందాని, మాదిగ సత్తాను ఈ మహా సంగ్రామ పాదయాత్ర తోపాటు జులై 2వ తేదీన జరిగే సడక్ బంద్ ను, జులై 3వ తేదీన హైదరాబాద్ జరిగే మాదిగల మహా గర్జన సభను జయప్రదం చేయాలని, మంద కృష్ణమాదిగ నాయకత్వం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ పగిడాల, పర్లపాడు, అరక్కటవేములకు పాదయాత్ర గా వస్తున్నారని మాదిగ ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పగిడాల గ్రామ కమిటీ నాయకుడు ప్రసాద్ మాదిగ, అరక్కటవేముల ఎం.ఎస్.పి పార్టి సీనియర్ నాయకులు రాందాసు మాదిగ, చిన్నయ్య మాదిగ, కొండయ్య మాదిగ, సునీల్ మాదిగ, సీతారాముడు మాదిగ, బాలబ్బి మాదిగ, పర్లపాడు ఎం.ఎస్.పి సీనియర్ నాయకులు చిన్నయ్య మాదిగ, చెన్నకేశవ మాదిగ ఎం.ఈ.ఎఫ్ పర్లపాడు నాయకుడు నరసయ్య మాదిగ ఎం.ఆర్.పీ.ఎస్, ఎం.ఎస్.పి జిల్లా నాయకుడు గులబ్బిగాళ్ళ సురేష్ మాదిగ ,విద్యార్థి,యువజన నాయకులు ఓబులేసు కత్తి మాదిగ, రమణ మాదిగ, ప్రసాద్ మాల మద్దతు తెలపగా, మాదిగ పల్లెల ప్రజలు పాల్గొన్నారు.
Commentaires