అత్యాచారానికి గురైన బాధిత దళిత మాదిగ బాలిక కుంటుంబానికి న్యాయం చేయాలి, నేరం చేసిన వారిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని MRPS, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్.
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన దళిత జాతి కి చెందిన మైనర్ బాలిక ను అంత్యంత దారుణం అత్యాచారం చేసి7నెలల గర్భవతిని చేసిన మానవ కామందులను వెంటనే శిక్షించాలని,మతిస్థిమితం లేని అమ్మాయి అని చూడకుండా కిరాతకం గా దుచర్యకు పాల్పడిన వారిని,సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,బాదిత బాలికకు వారి కుంటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే ప్రభుత్వం కల్పించాలని, ప్రభుత్వమే రేప్ కు గురైన బాలిక కు మెరుగైన వైద్యం అందించాలని, ఆ బాలిక తండ్రి కూడా మతిస్థిమితం సరిగా లేదు ఆయనకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించి మంచి వైద్యం అందించి బాగు చేయాలని, వీరి కుంటుంబానికి ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి వేంటనే ఇవ్వాలని,ప్రభుత్వ పథకాలు వారి కుంటుంబానికి అమలు చేయాలని వారికి ఎస్పీ నిధుల క్రింద అన్ని సదుపాయాలు కల్పించి వారిని ఆదుకోవాలని, అత్యాచారానికి పాల్పడిన కామాంధుల ను కఠిన చట్టాలతో శిక్షించాలని సీఎం సొంత జిల్లా లో ఇలా జరుగడం చాలా దారుణమైన సంఘటన అని, FIR కూడా సుమోటోగా నమోదు చేయండి జరిగింది తిరిగి అమ్మాయి బంధువుల స్టేట్ మెంట్ ప్రకారం కేసు నమోదు చేయాలని స్థానిక పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు వచ్చి తహసీల్దార్ ఆఫీసు సంబంధించిన సీనియర్ అసిస్టెంట్ కు డిమాండ్లు తో కూడిన వినతిపత్రం MRPS,ప్రజాసంఘాలు,విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో MRPS ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెలిగచర్ల.శివయ్య మాదిగ, రాధాకృష్ణ మాదిగ, ప్రొద్దుటూరు MRPSనియోజకవర్గ ఇన్ఛార్జ్ గడ్డం.నరసింహులు మాదిగ,యువసేన నాయకులు ఇల్లూరి.శివశంకర్ మాదిగ,KN.రాజా మాదిగ, కైపుభాస్కర్ మాదిగ, వేంకటేష్ మాదిగ, దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు యల్లయ్య మాదిగ, PKS నాయకులు నాగేంద్ర,మహిళ నాయకురాలు విజయరాణి మాదిగ, MEF నాయకులు పిఛ్చిక బాబు మాదిగ, సాల్మన్ మాదిగ, PDSO విద్యార్థి సంఘం రాయలసీమ కన్వీనర్ ఓబులేసు, అమృత నగర్ నుండి ,RMP ప్రసాద్ మాల, గుర్రం శేఖర్ మాల, గుర్రం ప్రసాద్ మాల, కాంతయ్య, అత్యాచారానికి గురైన బాలిక తండ్రి తదితరులు పాల్గొన్నారు.
Comentarios