ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి - ఎమ్మార్పీఎస్
రాజంపేట, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ వెలగచర్ల శివయ్య డిమాండ్ చేశారు. వర్గీకరణ కోరుతూ ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పి ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ వద్ద చేపడుతున్న నిరసన దీక్షలు మంగళవారానికి రెండవ రోజుకు చేరుకున్నాయి. ఎం ఎస్ పి జిల్లా నాయకులు మంద శివయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చేమూరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం రెండవ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లాలో కన్వీనర్ వెలగచర్ల శివయ్య మాట్లాడుతూ మండల నాయకులు, పట్టణ నాయకులు గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలను జయప్రదం చేశారని అన్నారు.
ఇదే విధంగా ఈనెల 21 22వ తేదీలలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే నిరసన దీక్షలను జయప్రదం చేయాలని, 23వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నాయకులు మందా శివయ్య, చేమూరు వెంకటేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ బిల్లు చేపడతామని హామీ ఇచ్చిన బిజెపి అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. వర్గీకరణ పైన మాదిగ, ఉపకులాల భవిష్యత్తు ఆధారపడి ఉందని, వర్గీకరణ ద్వారా వేలాదిమంది విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి, ఎం ఈ ఎప్ ఆధ్వర్యంలో బిజెపి వైఖరిని గ్రామ గ్రామాన ఎండగట్టి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ మండల అధ్యక్షులు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ శంకర్, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు గుంటు మని, సిద్ధారపు పెంచలయ్య, ఎర్రబల్లి నారాయణ, రేవూరి అఖిల్, కంటి ప్రేమ్ బాబు, జడ శివ, దండు సాయి, తేజ, మోహన్, వంగ పూరి వంశీ తదితరులు పాల్గొన్నారు.
Comments