top of page
Writer's pictureDORA SWAMY

ముక్కా ఫౌండేషన్ కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన.

---శిబిర సేవలను ఉపయోగించుకున్న 1200 మంది బాధితులు.

---నా సంపాదనలో 10 శాతం పేదల సంక్షేమానికి వెచ్చిస్తా... ముక్కారూపానంద రెడ్డి..

చిట్వేలు జిల్లా ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ముక్కారూపానందరెడ్డి ఫౌండేషన్ మరియు తిరుపతి శ్రీ బాలాజీ అరవింద కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు ముక్కారూపానంద రెడ్డి తన శ్రీమతి వరలక్ష్మితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ శిబిరానికి సుమారు 1200 మంది బాధితులు తమ వివిధ కంటి సమస్యలకు పరిష్కారం పొందారు. వీరిలో 145 మంది కంటి శుక్ల ఆపరేషన్లకు ఎంపిక కాగా; 170 మందికి కళ్ళ అద్దాలను మిగిలిన వారికి కంటి చుక్కల మందును పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 3000 మందికి ఉదయం మధ్యాహ్నం ఫౌండేషన్ నిర్వాహకులు అల్పాహార, భోజన సదుపాయం కల్పించారు.

ఈ శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ.. అనేకమందికి కంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యయ, ప్రయాసాలకు భయపడి నెట్టుకొస్తున్న వారందరికీ ఈ కంటి వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని, శిబిరాన్ని నిర్వహించడం గొప్ప విషయం అని అన్నారు.

ముక్కారూపానంద రెడ్డి, కుమారుడు సాయి వికాస్ రెడ్డి లు మాట్లాడుతూ:---

2021లో ప్రారంభించిన "రూపానంద రెడ్డి ఫౌండేషన్" ద్వారా నియోజకవర్గ పరిధిలో విస్తృత సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నామని అన్నారు. ఆపదలో ఉన్న వారికి, వివిధ గ్రామాల దేవాలయాల నిర్మాణానికి మా వంతుగా ఎల్లవేళలా సహాయం అందిస్తున్నామన్నారు. నేటితో కలిపి నియోజకవర్గంలో మూడవసారి నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి చిట్వేలి మండలంలో విశేష స్పందన లభించిందని వేలాదిమంది బాధితులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారని అన్నారు.మా కుటుంబ సంపాదనలో 10 శాతం పేదల సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలను ఎల్లప్పుడూ నిర్వహిస్తామని, రానున్న రోజుల్లో జిల్లా పరిధిలో ఈ సేవలు విస్తరిస్తామని తెలిపారు. రూపానందరెడ్డిని మండల మానవతా సభ్యులు శాలువా,మెమెంటో తో సత్కరించారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహాయ పడ్డ మండల నాయకులకు, స్వచ్ఛంద సంస్థలకు, ఎన్సిసి క్యాడెట్లకు, యువతకు రూపానంద రెడ్డి తమ ఫౌండేషన్ మేమెంటోలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ వైసీపీ నాయకులు పాటూరి శ్రీనివాసులు రెడ్డి,ఎల్ వి మోహన్ రెడ్డి,ఉమామహేశ్వర్ రెడ్డి, చక్రపాణి రెడ్డి,ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ,బత్తిన వేణు గోపాల్ రెడ్డి, ముక్కావారిపల్లి సర్పంచ్ శ్రీధర్, కరుణాకర్ రెడ్డి , ఎం.చిన్నా రాయల్,ఎంపిపి చంద్ర, ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, టి.సుబ్రహ్మణ్యం,వెంకటసుబ్బారెడ్డి,కోదండ రామయ్య,సర్పంచ్ బాలు,మధుసుదన్ రాజు, మండల మానవతా బాధ్యులు చౌడవరం సురేంద్ర రెడ్డి,మునిరావు,తురకా.రంగారెడ్డి,కంచర్ల సుధీర్ రెడ్డి,బాబు,స్థానిక ఎస్సై సుభాష్ చంద్రబోస్, వ్యాయామ ఉపాధ్యాయులు డేవిడ్, ఎన్సిసి అధికారి రాజశేఖర్, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

197 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page