కడపజిల్లా, ప్రొద్దుటూరు లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు, పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, చెన్నకేశవ స్వామి ఆలయాలలో ప్రత్యేకంగా అలంకరణ చేశారు, పాండురంగ స్వామి ఆలయం అలాగే నగరంలోని వివిధ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి, ప్రత్యేకంగా వైష్ణవ ఆలయాల్లో తెల్లవారుజామున 5 గంటలు నుండి భక్తులుకు ఉత్తర ద్వార దర్సనం, ఉదయం 4 గంటలు నుండే ఆలయాలకు పోటెత్తిన భక్తులు, ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో స్వామి వారికి విశేష పూజలు, అలంకరణలు, ఉత్తర ద్వార దర్సనం కోసం క్యూలైన్లు లో భారీగా వేచి ఉంటున్న భక్తులు, భక్తులు కోసం అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు, వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి కి ప్రత్యేక దీపాలంకరణ సేవ చేసిన అమ్మవారిశాల అర్చకులు, కోవిడ్ నిబంధనలు ఉన్న ఆలయాల్లో ఎక్కడ తగ్గని భక్తులు తాకిడి, కోవిడ్ ఆంక్షలు పాటించవలసినదిగా భక్తులకు ఆలయ ప్రాంగణంలో విధిగా బోర్డులు ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులు.
top of page
bottom of page
Comments