గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, 76 వార్డు నడుపూరు, రిక్షా కాలనీ, రామచంద్ర నగర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ లో మున్సిపల్ కమిషనర్ లక్ష్మి షా సుడిగాలి పర్యటన. గాజువాక అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశా అన్నారు. జీవీఎంసీ 76 ఆయన విస్తృతంగా పర్యటించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 76 వ వార్డు వైసిపి ఇంచార్జ్ దొడ్డిరమణ ఈ పర్యటన లో పాల్గొని ఆయా వార్డుల్లో గల సమస్యలను కమిషనర్కు తెలియజేశారు. ప్రధానంగా డ్రైన్లు వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గడ్డలనుఆధునీకరించి పూడిక తీయించిలేకపోవడం వల్ల గతంలో కురిసిన వర్షాలకు హౌసింగ్ బోర్డ్ , బర్మా కాలనీ, రిక్షా కాలనీ నీట మునగడం జరిగినది ఈ విషయాన్ని కమిషనర్ గారికి అధికారులకు తెలియజేశారు దానికి గల కారణం గంగవరం పోర్టు గుండా గడ్డ నీరు సముద్రంలో కలవడం దానికి అడ్డుగోడ కట్టడం వల్ల యొక్క సమస్య ఏర్పడుతుందని దాన్ని మీయొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ సమస్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని సత్వరమే ఆ యొక్క సమస్యలను తీర్చగలరని తెలియజేశారు ఆధునీకరించి పూడిక తీయించి అభివృద్ధి చేయాలని 76 వార్డు లో గల డంపింగ్ యార్డ్ ను ఆధునీకరించి వాసన లేకుండా చేయించాలని లేదంటే తక్షణం మార్చాలని, అలాగే రిక్షా కాలనీ స్వతంత్ర నగర్ ఆనుకొని ఉన్న గడ్డ ఆధునీకరించి మొక్కలు నాటాలని అలాగే నడుపూరు గాంధీ పార్కు ఆధునీకరించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. దీని మీద స్పందించిన కమిషనర్ తక్షణ చర్యలు తీసుకొని ఆధునికరిస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గాజువాక వైసీపీ ఇన్ చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీధర్, స్థానిక సీనియర్ నాయకులు శంకర్ నారాయణ, రంభ నారాయణ మూర్తి మరియు జీవీఎంసీ శానిటరీ సిబ్బంది ఆరోగ్య సిబ్బందితదితరులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comments