పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి - మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పోలా శ్రీనివాసులు రెడ్డి కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ మార్షల్ మార్చ్ సందర్భంగా పురపాలక పరిధిలోని ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించేందుకు ఆర్ అండ్ బి బంగ్లా వద్ద మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి పురపాలక సిబ్బందితో కలిసి మానవహారంగా ఏర్పడి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల నివారణ, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడం, గార్ఫేస్ ఫ్రీ సిటీ, పరిశుభ్రత పైన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ స్వచ్ - క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం పైన ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటితోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటేనే స్వచ్ఛ్-క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పురపాలక కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Comments