ప్రొద్దుటూరు ప్రజలకు త్వరలో మునిసిపల్ పార్క్ అందుబాటులోకి
నూతన హంగులతో పిల్లలకు పెద్దలకు ఆహ్లాదకరమైన వాతావరణం
డెబ్భై అయిదు శాతం పనులు పూర్తి, 2023 ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబటులోకి - వివరాలు వెల్లడించిన రాచమల్లు.
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మునిసిపల్ పార్క్ ఆధునీకరణ పనులు దాదాపు డెబ్భై అయిదు శాతం పూర్తి అయినట్లు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడించారు. శనివారం ఉదయం స్థానిక మునిసిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ప్రొద్దుటూరు పట్టాణ వాసులకు ఆహ్లాదాన్ని, విశ్రాంతిని అందించటానికి నాడు నెలకోల్పిన గాంధీ మునిసిపల్ పార్క్ శిథిలావస్థకు చేరుకోగా, దాదాపు రెండు కోట్ల యాబై ఏడు లక్షల రూపాయల నిధులతో నూతన పార్కు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఉపయోగపడేలా ఆహ్లాదకరమైన వాతావరాన్ని ఏర్పాటు చేసి నూతన హంగులతో 2023 ఫిబ్రవరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవనున్నట్లు ఆయన తెలిపారు.
గత ప్రభుత్వాల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గాంధీ పార్కు శిథిలావస్థకు చేరుకున్నదని, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మరిన పార్కు నేడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నట్లు, ఇకపోతే పిల్లల ఆట పాటలకు ప్రాధాన్యత కల్పిస్తూ వారికి పన్నెండు రకాల ఆట వస్తువులు, పెద్దలకు విశ్రాంతి కొరకు నీడనిచ్చే చెట్లు, అద్దె వాసులు చేస్తూ చిన్నపాటి శుభకార్యాలు చేసుకోవటానికి ఓపెన్ ఎయిర్ ఫంక్షన్ హాలు, యువత ఆరోగ్యం పట్ల శ్రాధ వహించటానికి జిమ్, వాకింగ్ ట్రాక్, రాతితో నిర్మించిన మందిరాలు, నిలువెత్తు మహాత్మా గాంధీ విగ్రహం, శుచి శుభ్రతలతో ప్రొద్దుటూరు కేఫ్ పేరిట హోటల్, యోగా సెంటర్ తదితర వసతులు కల్పించనున్నట్లు రాచమల్లు తెలియజేసారు.
Komentarze