ఆత్మాభిమానమే సుబ్బారావు ఆత్మహత్యకు కారణం - వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
మంగళవారం విజయవాడ కృష్ణానదిలో ఆత్మహత్య చేసుకున్న ఎన్.వి సుబ్బారావు తనకు గడచిన 18 సంవత్సరాలుగా అత్యంత సన్నిహితుడని, అలాగే తమ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవాడని, ఇలాంటి నేపథ్యంలో గడచిన ఎన్నికలలో సుబ్బారావు 12 కోట్ల రూపాయల మేర అప్పులు చేసి ఇందులో తమకు కూడా పలువురు దగ్గర నుండి అప్పులు ఇప్పించినట్లు వచ్చిన వార్తలను ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఖండించారు.
ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైస్ చైర్మన్ బంగారు రెడ్డి మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు అలాగే తనపై సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, సుబ్బారావు తమను బాకీ డబ్బులు అడిగితే ఇవ్వబోము అన్నట్లు పుకార్లు సృష్టించారని, సుబ్బారావు కుటుంబ సభ్యులతో అలాగే వారి సమీప బంధువులతో తాను మాట్లాడగా, ఇప్పటివరకు ఎవరు కూడా మృతుడు సుబ్బారావు బాకీ ఉన్నట్లు తమ దృష్టికి తీసుకు రాలేదని స్పష్టం చేసినట్లు, కాగా సుబ్బారావుకు పాతిక లక్షల నుండి 30 లక్షల రూపాయల మేర వ్యక్తిగత వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అప్పులు ఉన్నాయని, ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన పందాలలో దాదాపు 5 మందికి 68 లక్షల రూపాయల మేర బాకీ పడినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
గత కొంతకాలంగా తమతో సన్నిహితంగా ఉంటున్న సుబ్బారావు అప్పుల విషయమై తమ దృష్టికి తెచ్చి ఉంటే తాము ఆర్థిక సాయం చేసేవారమని, నేడు ఆయనకు ఆత్మహత్య చేసుకునే ఆవశ్యకత లేకపోవునని అభిప్రాయపడ్డారు. తమపై బురద చల్లే ప్రయత్నంలో భాగంగానే తమను దోషులుగా చిత్రీకరించాలనే దురుద్దేశంతో సామాజిక మాధ్యమాలలో పుకార్లు సృష్టించారని, ఈ నేపథ్యంలో మే నెల 1వ తేదీ నుండి ఎలక్షన్ జరిగిన 13వ తేదీ వరకు తమకు డబ్బులు ఇచ్చినట్లు నిరూపించాలన్నారు.
గతంలో సుబ్బారావు చేసిన అప్పులతో తమకు ఎటువంటి సంబంధం లేదని పై పేర్కొన్న తేదీలలో సుబ్బారావు వ్యక్తిగతంగా కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ అప్పు చేసినట్లు ఆయన సామాజికవర్గ పెద్దలు అయిన ఆర్యవైశ్య సభ నందు బాండ్లు చూపించిన యడల స్నేహితుడు అయినందు వలన మానవతా దృక్పథంతో తక్షణం తాము డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన సవాల్ విసిరారు. ఆత్మాభిమానమే సుబ్బారావు ఆత్మహత్యకు ప్రధాన కారణంగా ఆయన అభిప్రాయపడుతూ, ఇకనైనా తమపై బురద చెల్లే ప్రయత్నం మానుకోవాలని హితువు పలికారు. సమావేశంలో నాలుగవ వార్డు కౌన్సిలర్ వరుకుటి ఓబులరెడ్డి, 32 వ వార్డు కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, అనిల్, వైసీపీ నాయకులు భీమునిపల్లి నాగరాజు పాల్గొన్నారు.
Comments