కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాం -
మునిసిపల్ వైస్ చైర్మన్
వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ 13వ వార్డు శంకర్ రావు వీధి నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాడు సచివాలయాలకు కేటాయించిన నిధులలో 22 లక్షల రూపాయల వ్యయంతో నూతన సిసి రోడ్డు, మురుగు కాలువల నిర్మాణం కొరకు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, కొన్ని ముగింపు దశకు వచ్చాయని, ప్రతిపక్ష నాయకులు, కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆయన కోరారు. మున్సిపల్ కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బిల్లులు చెల్లించిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా, టీటీడీ పాలక మండలి సభ్యుడు మారుతీ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు కామిశెట్టి బాబు, పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, మున్సిపల్ కౌన్సిలర్లు జిలాన్, కంకర గౌస్, గరిశ పాటి లక్ష్మి దేవి, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments