ముందు టిడిపి నాయకులతో ప్రమాణాలు చేయించాలి - వైస్ చైర్మన్ పాతకోట
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రభుత్వ ఉన్నతాధికారులచే అవినీతి అక్రమాలకు పాల్పడమని ప్రమాణాలు చేయిస్తున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ముందుగా టిడిపి నాయకులు ఆ పార్టీ శ్రేణులతో అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ప్రమాణాలు చేయించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం వైయస్సార్సీపి కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా రెండు విషయాలపై చర్చించారు. ఇందులో భాగంగా కుందు, పెన్న, అలాగే జగనన్న కాలనీల నుండి టిడిపి నాయకులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపిస్తూ, స్వయాన ఎన్విఆర్ఆర్ అనే పేరుగల టిప్పర్లతో ఎమ్మెల్యే సోదరుని కుమారుడు ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవినీతి అక్రమాలను తాము కూడా వ్యతిరేకిస్తామని, ప్రొద్దుటూరులో అక్రమ రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతొందని, ప్రస్తుత మున్సిపల్ మూడవ వార్డు కౌన్సిలర్ ఇంటి ప్రక్కన శుక్రవారం అక్రమ రేషన్ బియ్యం పట్టివేతను ప్రశ్నించారు? తమ ప్రభుత్వ హయాంలో తాము ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తే, ప్రస్తుత టిడిపి ప్రభుత్వ హయాంలో ఏకంగా టిప్పర్లతో ఇసుకను మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని చెప్పటం ఇక్కడ గమనార్హం! సమావేశంలో కౌన్సిలర్లు జిలాని, అనిల్ కుమార్, మాజీ కౌన్సిలర్ పోస భాస్కర్, మూడవ ఇంచార్జ్ భాష, తదితరులు పాల్గొన్నారు.
Comments