వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
గురువారం ఉదయం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం భవనం నందు ప్రొద్దుటూరు పురపాలక సంఘ అత్యవసర సమావేశం నిర్వహించారు. స్పెషల్ గ్రాంటు క్రింద మునిసిపల్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్ ఆధునీకరణ, నిర్మించుటకు దాదాపు యాబై కోట్ల తొంబై లక్షల అంచనా వ్యయముతో అజెండా లోని ఎకైక అంశము చేర్చకు రాగా కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గంలో అయిదు వందల ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి పనులలో భాగంగా టెండర్ దశ ముగించుకొని త్వరలో ఆన్ని హంగులతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నామని, గత మూడు సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్దే లక్షంగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఇది గిట్టని ప్రతిపక్షాలు తమపై అర్ధరహిత ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారని, తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మాణం ఏ విధంగా తాము నిర్మించాము అన్నది మరచిన ప్రతిపక్షాలు, మార్కెట్ ఖాళీ స్థలాన్ని తాము బహుళ జాతి కంపెనీలకు అమ్మినట్లు కట్టు కథలు అల్లారని, మున్సిపాలిటీ స్థలాన్ని తాము ఎలా అమ్మగలము అని ప్రశ్నించారు. కాగా నేడు కార్యరూపం దాల్చిన మార్కెట్ నిర్మాణం ప్రజలకు మరో రెండు సంవత్సరాలలో అందుబాటులోకి రానున్నట్లు తెలియచేశారు. టెండర్ ప్రక్రియ ముగించుకొని పని మొదలు పెట్టే దశకు చేరిన మార్కెట్ నిర్మాణ పనులకు సంబంధించిన అజెండా లోని అంశాన్ని కౌన్సిలర్లు ఆమోదించారు.
కాగా మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి పదవీ కాలంలో ఈ నూతన నిర్మాణం చేపట్టటం అభినందించదగ్గ విషయమని, నాటి మునిసిపల్ కమిషనర్ డి. రాధ తన వీధులలో భాగంగా సాహసోపేతంగా మార్కెట్ ను ఖాళీ చేయించారని, అందువలనే నూతన మార్కెట్ నిర్మాణం చేపట్టగలిగామని గుర్తు చేశారు. అనంతరం కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఎమ్మెల్యే రాచమల్లుకు, చైర్మన్ లక్ష్మీదేవి, వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, మునిసిపల్ కమిషనర్ కు శాలువా కప్పి సన్మానించి పుష్పగుచ్ఛం అందచేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులు, కూరగాయల మార్కెట్ వ్యాపారులు పాల్గొన్నారు
תגובות