అక్రమ సంబంధమే హత్యకు కారణం
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ కానపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఆకుముల్ల నాగేంద్రబాబును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపినట్లు, మృతుని భార్య ఆకుమల్ల ఇమాంబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూర్ మూడవ పట్టణ సీఐ టి. నారాయణ యాదవ్, రెండో పట్టణ సిఐ జి. ఇబ్రహీం కేసును ఛాలెంజ్ గా తీసుకొని 24 గంటలు గడిచే లాగా ముద్దాయిలను అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే, ఒక మహిళతో మృతుడు ఆకుమల్ల నాగేంద్రబాబుకు అలాగే ఆకుమల్ల నగేష్ అనే వ్యక్తికి శారీరక సంబంధం ఉన్నట్లు, ఈ క్రమంలో ఆకుమల్ల నగేష్ మృతుడు ఆకుమల్ల నాగేంద్రబాబు అడ్డు తొలగించుకోవడానికి ఆ మహిళతో కలిసి కుట్ర పన్ని, గంటా మరియమ్మ ఇంటిపై నిద్రిస్తున్న నాగేంద్రబాబును తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పదునైన కత్తితో గొంతు కోసి చంపినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఆకుమల్ల నగేష్ (22), మహిళను అరెస్టు చేసినట్లు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. వారి వద్ద నుండి ఒక కత్తి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు తెలియజేశారు.
కాగా కేసును చేదించటంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐలు టి నారాయణ యాదవ్, జి ఇబ్రహీం, ఎస్సైలు కే చిరంజీవి, బి శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నాగా, సాయిప్రసాద్, వారి సిబ్బందిని డిఎస్పి నాగరాజు అభినందించి తగు రివార్డులకు సిఫారసు చేసినట్లు తెలిపారు.
Comments