కరెడ్ల క్రిష్ణ ఆద్వర్యం లో ఉచిత కంటి వైద్య శిబిరం
మైదుకూరు మున్సిపాలిటీ ఆఫీస్ లోని స్త్రీ శక్తి భవనంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జనలిస్ట్ మైదుకూరు నియోజకవర్గ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోముఖ్య అతిధిగా పాల్గొన్న మైదుకూరు రురల్ సిఐ నరేంద్ర రెడ్డి, డిప్యూటీ తహశీల్ధార్ మల్లికార్జున, మునిసిపల్ కమిషనర్ రాముడు,సేవ్ జర్నలిస్ట్ డే దినోత్సవాన్ని పురస్కరించుకొని మైదుకూరు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కరెడ్ల క్రిష్ణ ఆద్వర్యం లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటశివ విజన్ ఐటెల్ ఆప్టికల్స్ సహకారంతో ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ అభిలాష్ ఎమ్ ఎస్ ఆప్తమాలజి కంటి వైద్య నిపుణులు విలేకరులకు కంటి పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులను పంపిణీ చేశారు. కంటి అద్దాలు అవసరమైన వారికి 50 శాతం రాయితీతో అందించారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ విలేకరులు మీడియా ప్రతినిధులు సమాజం పట్ల బాధ్యతగా అవినీతిని వెలికి తీసే క్రమంలో అనేక ఇబ్బందులకు లోనైనా కూడా తమ వృత్తిని నిబద్ధతగా చేయడం జరుగుతుందనిఉద్యోగులుగా మేము జీతాలు తీసుకుని బాధ్యతలు నిర్వహిస్తే సమాజం కోసం విలేకరులు ఎటువంటి ఆశ లేకుండా కుటుంబాలను సైతం లెక్కచేయకుండా వార్తలు రాసి తమ విధినిర్వర్తిస్తారన్నారు. విలేకరుల సేవలు వెలకట్టలేనివని ప్రస్తుతం మీడియా చాలా కొత్త విధానంలో వార్తలను అందిస్తోంది అన్నారు.
విలేకరులకు సైతం క్షమాగుణం ఉంటుందని కొనియాడారు. అనంతరం సీనియర్ జర్నలిస్టు మాజీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని విలేకరులపై దాడులను అరికట్టాలని కోరుతూ మైదుకూరు నియోజకవర్గం ఏపీడబ్ల్యుజె ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు కర్రెడ్ల కృష్ణ మాట్లాడుతూ అమర వీరుడు సర్దార్ భగత్ సింగ్ స్ఫూర్తితో సేవ్ జర్నలిజం పత్రికా స్వేచ్ఛ మరియు మీడియా అనేది ప్రజస్వామ్యానికి నాలుగు స్తంభాలలో ఒకటి. యునైటెడ్ నేషన్స్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్టికల్ 19 పత్రికా మరియు మీడియా స్వేచ్ఛనుసమర్థిస్తూ ఉంది. అభిప్రాయం మరియు భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ హక్కులో భాగంగా పత్రికా లేదా మీడియా ద్వారా సమాచారం అందించడంలో స్వేచ్ఛ కలిగి ఉంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం రాష్ట్ర రాజ్యాంగ నిబంధనలు ప్రకారం పత్రికా మరియు మీడియాకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ ప్రస్తుత కాలంలో జర్నలిస్టులపై దాడులు వారి హక్కులను భంగం కలిగించే చర్యలు ఎక్కువ అవుతున్నాయి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలని, పాత్రికేయుల వృత్తి, వేతన హక్కులను రక్షించాలని పాత్రికేయులపై జరుగుతున్న దాడులను పూర్తిగా అరికట్టాలని మైదుకూరు నియోజక వర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏపీయూడబ్ల్యూజే తరపున కోరుతున్నాము అని తెలుపుతూ కర్రెడ్లకృష్ణ ఆధ్వర్యంలో మైదుకూరు మండల తాసిల్దార్ అనురాధ రూరల్ సీఐ నరేంద్ర రెడ్డిలకు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే గౌరవ అధ్యక్షులు, బొమ్మిశెట్టి మోహన్ కసెట్టి చంద్రమోహన్, సిగినేని మురళి ,మండల అధ్యక్షులు జగన్ ,సంజీవ్ , చంద్ర ,సుధాకర్ రెడ్డితోపాటు ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ నాయకులు తోట రామ్మోహన్ ,యాపరాల ప్రసాద్ , ప్రసాద్ చొక్కం, యపరాల వెంకటసుబ్బయ్య, జయరాం , ప్రసాద్, గంగారావు , చంటి ,కుమార్ , రంజిత్ సునీల్ సుబ్బయ్య, భూమిరెడ్డి రవి కళ్యాణ్, వర్ధన్ కమిటీ సభ్యులు,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments