top of page
Writer's pictureEDITOR

మతిపోగొడుతున్న నక్షత్రం.. ఆశ్చర్యపోతున్న ఖగోళ శాస్త్రవేత్తలు

మతిపోగొడుతున్న నక్షత్రం.. ఆశ్చర్యపోతున్న ఖగోళ శాస్త్రవేత్తలు

ప్రతీకాత్మక చిత్రం - Symbolic Image

ఆ నక్షత్రం అలా ఎందుకు మారిందన్న ప్రశ్న ఖగోళ శాస్త్రవేత్తల్ని వేధించింది. దాని కోసం వారు జోరుగా పరిశోధన సాగించారు. మరి వాళ్లు ఏం తేల్చారో తెలుసుకుందాం.

గంటకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే బస్సు సడెన్‌గా ఆగిపోయిందనుకోండి. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఉంటాడని అనుకుంటాం. మరి అత్యంత వేగంగా తిరిగే ఓ నక్షత్రం వేగం... సడెన్‌గా తగ్గిపోతే... దానికి కారణం ఏమై ఉంటుంది? బస్సుకి డ్రైవర్ ఉండటం లాజిక్. మరి నక్షత్రంలో అలా ఎవరూ ఉండరు కదా. కానీ ఆ నక్షత్రం అలా చేయడం శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచింది. అది మామూలు నక్షత్రం కాదు. మృత నక్షత్రం. అత్యంత ఎక్కువ ఆకర్షణ కలిగి ఉంది. ఇలాంటి వాటిని మాగ్నెటార్ అంటారు. ప్రస్తుతానికి దాని పేరు SGR 1935+2154. అక్టోబర్ 2020లో ఆ నక్షత్ర వేగం ఒక్కసారిగా తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆ నక్షత్రంపై మూడు ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (FBR) జరిగాయి. అదే ప్రదేశం నుంచి నెల పాటూ రేడియో తరంగాలు దూసుకొచ్చాయి.

ఇలా ఎందుకు జరిగింది అని అన్వేషించారు. రకరకాల అధ్యయనాలు జరిగాయి. తాజాగా ఓ కొత్త అధ్యయనం ప్రకారం.. ఆ నక్షత్ర ఉపరితలంపై ఓ అగ్ని పర్వతం లాంటిది పేలిందని అంచనా వేశారు. దాని వల్లే నక్షత్ర వేగం తగ్గి ఉంటుందని అంచనా వేశారు. నక్షత్ర అయస్కాంత ధ్రువం దగ్గర ఈ పేలుడు జరిగివుండొచ్చనీ.. అందువల్లే వేగం తగ్గి ఉంటుందని భావించారు. నక్షత్రాల కాలగమనం పూర్తైన తర్వాత పేలిపోతాయి. ఆ తర్వాత అవి మృత నక్షత్రాలుగా మిగిలిపోతాయి. అవి కొన్ని కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగివుంటాయి. ప్రతి కొన్ని సెకండ్లకూ అవి ఓ భ్రమణాన్ని పూర్తి చేస్తాయి. వాటి నుంచి అత్యంత తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలు విశ్వంలోకి విడుదలవుతూ ఉంటాయి.

సాధారణంగా ఏదైనా నక్షత్రంలో పేలుడు సంభవిస్తే.. అందులోని కొంత పదార్థం.. విశ్వంలోకి వెళ్లిపోతుంది. తద్వారా ఆ నక్షత్రం బరువు తగ్గి... అది మరింత వేగంగా తిరుగుతుంది. కానీ ఈ మృత నక్షత్రం విషయంలో రివర్సులో జరిగింది. దాని వేగం తగ్గింది. అందుకే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యం కలిగింది. ఈ నక్షత్రం మన భూమికి 30వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. మన పాలపుంత లోనే ఉన్న దీన్ని 2014లో కనిపెట్టారు. మన పాలపుంతలో మొదటి ఫాస్ట్ రేడియో బరస్ట్‌ (FBR)ని ఈ నక్షత్రం నుంచే గుర్తించారు. ఈ నక్షత్రానికి సంబంధించిన వివరాల్ని నేచర్ ఆస్ట్రానమీ‌లో ప్రచురించారు. ఈ నక్షత్రం విషయంలో కచ్చితంగా ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. విశ్వంలో ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. శతాబ్దాలుగా ఇవి మిస్టరీగానే ఉంటున్నాయి.


26 views0 comments

ความคิดเห็น

ได้รับ 0 เต็ม 5 ดาว
ยังไม่มีการให้คะแนน

ให้คะแนน
bottom of page