ప్రియాంక గాంధీ నన్ను జైలులో కలిశారు.. ఆమె తండ్రి హత్య గురించి అడిగి ఏడ్చేశారు - నళిని
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా నళిని శ్రీహరన్‌తో పాటు మరో ఐదుగురి విడుదలకు శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నళిని శనివారం వెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన నళిని పలు విషయాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా తనను జైలులో కలిశారని.. ఆమె తండ్రి రాజీవ్ గాంధీ హత్యపై ప్రశ్నించారని చెప్పారు. ఆ సమయంలో ప్రియాంక ఆమె తండ్రిని గుర్తు చేసుకుని గాంధీ భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు. ఆమె తన తండ్రి కోసం భావోద్వేగానికి గురయ్యారు. ఆమె ఏడ్చేశారు’’ అని నళిని చెప్పారు. అలాగే తన భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్‌ను తిరుచ్చి ప్రత్యేక శిబిరం నుంచి వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నళిని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.
Comments