వాల్మీకులను ఓటర్లగానే గుర్తిస్తున్నారు - నల్లబోతుల
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాల్మీకుల బోయలను జగన్ సర్కార్ ఓటర్లగానే గుర్తిస్తున్నారని, దదాపు నలబై లక్షల పైచిలుకు జనాభా గల వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామని నాడు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను సీఎం జగన్ మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని వాల్మీకి యువసేన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లబోతుల నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నలబై లక్షల వాల్మీకుల ఓట్లు కొల్లగొట్టటానికి జగన్ పన్నాగం పన్నారని, గత మూడు సంవత్సరాలుగా పోలవరం, అమరావతి పనులు అటకెక్కినట్లు వాల్మీకులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇచ్చిన మాటాకు జగన్ కట్టుబడలేదని, 1956లో వాల్మీకులు ఎస్టీలుగా ఉండగా, తరువాత బీసీలలోకి మార్చటం జరిగిందని అన్నారు. గత అరవై అయిదు సంవత్సరాలుగా తాము ఎస్టీ వర్గీకరణ కొరకు పోరాటం చేస్తున్నామని, ఇదిలా ఉండగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాల్మీకుల సమస్యను గుర్తించి సత్య పాల్ కమిటీ, ఎస్సీ ఎస్టీ చైర్మన్ కారం శివాజీ కమిటీలు వేసి, టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపించారని. కానీ 2019 ఎన్నికలు రావటం చేత వర్గీకరణ అంశం మరుగున పడిందని గుర్తు చేశారు. కాగా గతంలో జగన్ మోహన్ రెడ్డి వాల్మీకులకు ఇచ్చిన మాట విస్మరించి తమని ఓటర్లగానే చొస్స్తున్నారని, వర్గీకరణ అంశాన్ని అటక ఎక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. వాల్మీకులు జగన్ మాట నమ్మరని, ఇప్పటికయినా ఎస్టీ వర్గ ధ్రువీకరణ చేసి తీరాలని, నూతన కమిటీలు వేసి తమను మభ్యపెట్టె ప్రయత్నం చేయవద్దని, ఇకనైనా తమను ఎస్టీలుగా గుర్తించి గౌరవం కల్పించాలని ఆయన కోరారు.
Comments