బీసీలపై కపట ప్రేమను చూపిస్తున్న వైసిపి ప్రభుత్వం పై నిరసిద్దాం... కడప కలెక్టరేట్ ఎదురుగా నిరసన కు తరలిరావాలని పిలుపు - రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు
రాష్ట్రంలో బీసీలపై కపట ప్రేమను చూపే వైసీపీ ప్రభుత్వ ప్రయత్నం ఎండగట్టేందుకు టిడిపి రాష్ట్ర బీసీ అధ్యక్షులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొనే కడప కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమానికి తరలిరావాలని రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు జిల్లా టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో బీసీల అణచివేత ధోరణిపై వైసీపీ ప్రభుత్వం పై ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో బీసీలంతా ఇదేం కర్మ అని బోరుమంటుంటే బీసీలను ఉద్ధరించేశాం అంటూ సభ పెట్టి వారిని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవడం సిగ్గుచేటు అన్నారు. గత టిడిపి పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేసి బీసీలను ముంచారని విమర్శించారు. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రోత్సాహం కల్పించింది అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిధులు విధులు లేని 56 బిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలను అవమానానికి గురి చేశారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మూడు నెలల లో బీసీలకు ఏం చేసిందో చెప్పకుండా ఎంతో చేసేశామంటూ అంకెల గ్యారడితో మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కడప కొత్త బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం నుండి కడప కలెక్టరేట్ వరకు నిర్వహించే ర్యాలీలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ అధ్యక్షులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. కావున ఈ నిరసన కార్యక్రమానికి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో కడప పార్లమెంటు కార్యదర్శి యమ్మనూరు ఆంజనేయులు, ప్రొద్దుటూరు మండలం ఉపాధ్యక్షుడు షరీఫ్, ప్రొద్దుటూరు తెలుగు యువత కార్యదర్శి పల్లా సాయిరాం పాల్గొన్నారు.
Comments